AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వులే నువ్వులు..

విదేశాల నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసింది.. మాట్లాడు బామ్మా అంటూ మనవరాలు వేసిన చిన్న ప్రాంక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యింది. ఫోన్ అవతల ఉన్నది మనిషి కాదు ఏఐ రోబోట్ అని తెలియక, ఆ బామ్మ ఎంతో ఆప్యాయంగా హిందీలో మాట్లాడిన తీరు చూస్తే ఎవ్వరికైనా నవ్వాగదు. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న ఆ వైరల్ వీడియో మీరూ చూడండి..

Video: మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వులే నువ్వులు..
Grand Mother Talking To Chatgpt
Krishna S
|

Updated on: Sep 01, 2026 | 7:23 PM

Share

నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. టికెట్ బుకింగ్ నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం వరకు సాంకేతికతతో పనులు సులువైపోయాయి. ప్రస్తుత తరానికి ఏఐ అనేది దైనందిన జీవితంలో ఒక సాధారణ విషయంగా మారినప్పటికీ, పాత తరం వారికి మాత్రం ఇది ఇంకా వింతగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీని నిజమైన మనిషి అనుకుని అమాయకంగా మాట్లాడిన ఓ బామ్మ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆషు అనే యువతి తన బామ్మతో సరదాగా ఒక ప్రాంక్ చేయాలని భావించింది. ఫోన్‌లో చాట్‌జీపీటీ యాప్ వాయిస్ మోడ్‌ను ఆన్ చేసి, బామ్మ వద్దకు వెళ్లి విదేశాల నుంచి నా ఫ్రెండ్ మాట్లాడటానికి కాల్ చేసింది.. ఆమెకు హిందీ కూడా వచ్చు, ఒకసారి మాట్లాడు అంటూ ఫోన్‌ను బామ్మ చేతికి ఇచ్చింది.

ఆప్యాయంగా ముచ్చట్లు..

మనవరాలి మాటలను పూర్తిగా నమ్మేసిన ఆ బామ్మ, ఫోన్ అవతలి వైపు ఉన్నది ఏఐ చాట్‌బాట్ అని గ్రహించలేకపోయింది. నిజంగానే మనవరాలి స్నేహితురాలే మాట్లాడుతుందని భావించి చాలా ఆప్యాయంగా హిందీలో ముచ్చట్లు మొదలుపెట్టింది. అవతలి నుంచి చాట్‌జీపీటీ హిందీలో స్పందిస్తూ బదులిస్తుండటంతో.. బామ్మ మరింత ఆసక్తిగా ఎంతో అమాయకంగా ప్రశ్నలు అడుగుతూ సంభాషణను కొనసాగించింది.

నెటిజన్ల మనసులు గెలుచుకున్న బామ్మ అమాయకత్వం

బామ్మ ఎంతో సహజంగా, ఆప్యాయంగా చాట్‌జీపీటీతో మాట్లాడుతున్న దృశ్యాలను మనవరాలు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. “పాత తరం వ్యక్తుల అమాయకత్వం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది’’ ‘‘సాంకేతికత ఎంత ఎదిగినా.. మన పెద్దల ముద్దు ముద్దు మాటలు, ఆప్యాయతలు ఎప్పటికీ ప్రత్యేకమే’’ అంటూ నెటిజన్లు ఆ బామ్మ ముచ్చట్లకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

వీడియో చూడండి..

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?