Telugu News Trending Duck swimming with its babies sitting on its back video gone viral on social media
Viral Video: తల్లిప్రేమకు హద్దులు లేవని నిరూపించిన బాతు.. పిల్లలను వీపుపై కూర్చోబెట్టుకుని నదిలో ఈదులాట
మాతృత్వం ఎనలేనిది. తల్లి ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు. మనుషులకైనా, జంతువులకైనా, పక్షులకైనా తల్లి ప్రేమ ఒక్కటే. అమ్మ సెంటిమెంట్ కు సంబంధించిన వీడియోలు నెటిజన్ల మనసు దోచేస్తాయి. కాగా ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి....
మాతృత్వం ఎనలేనిది. తల్లి ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు. మనుషులకైనా, జంతువులకైనా, పక్షులకైనా తల్లి ప్రేమ ఒక్కటే. అమ్మ సెంటిమెంట్ కు సంబంధించిన వీడియోలు నెటిజన్ల మనసు దోచేస్తాయి. కాగా ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు. తల్లికి తన బిడ్డల కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పిల్లలకు కష్టం వస్తే ఆ తల్లే అండగా నిలిచి వారిని కష్టాల నుంచి కాపాడుతుంది. ఈ వీడియోలో ఒక బాతు తన పిల్లలను వెనుక వీపుపై కూర్చోబెట్టి నదిలో ఈదడం కనిపిస్తుంది. ఒక చెరువులో బాతు తన పిల్లలతో కలిసి ఈత కొడుతోంది. పిల్లలు నీటిలో పడిపోకుండా తల్లే కవచంలా మారింది. తన పిల్లలను వీపుపై కూర్చోబెట్టి ఈదడం ప్రారంభించింది.
ఈ విడియో @buitengebieden అనే ఖాతాతో ట్విట్టర్‌లో ద్వారా పోస్ట్ అయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 40 లక్షల మందికి పైగా వ్యూస్ వచ్చాయి. ఏకంగా లక్ష మందికి పైగా లైక్ చేశారు. అంతే కాకుండా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి అని, తల్లిగా ఉండటం అంత సులభం కాదని ఇంకొకటి, ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరని మరికొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో పొంగిపోతున్నారు. దీంతో ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.