Watch: ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం.. ఈడ్చి ఈడ్చి తన్నిన ఆడవాళ్లు

తాగుబోతు చేష్టలకు విసిగిపోయిన ఆ యువతులు ఎదురుతిరిగారు. అతడ్ని కాలితో తన్నుతూ బస్సులోంచి కిందకు దింపేశారు..చేతికి దొరికిన కర్రలతో కొట్టి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇదంతా తమ సెల్‌ఫోన్లలో రికార్డ్‌ చేసిన తోటి ప్రయాణికులు వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది..

Watch: ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం.. ఈడ్చి ఈడ్చి తన్నిన ఆడవాళ్లు
Drunk Man Mis Behaves

Edited By: Jyothi Gadda

Updated on: Apr 13, 2025 | 9:12 AM

ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. బస్సులో ఉన్న అమ్మాయిలతో అసైభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై దాడికి యత్నించాడు. దాంతో ఆ యువతులంతా కలిసి ఆ తాగుబోతుకు తగిన శాస్తి చేశారు. ఈ ఘటన సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి సిద్దిపేటకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆగినప్పుడు మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు బస్సులో ఎక్కాడు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా బస్సు నడుస్తున్న సమయంలో సదరు తాగుబోతు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

తాగుబోతు చేష్టలకు విసిగిపోయిన ఆ యువతులు ఎదురుతిరిగారు. అతడ్ని కాలితో తన్నుతూ బస్సులోంచి కిందకు దింపేశారు..చేతికి దొరికిన కర్రలతో కొట్టి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

వెంటనే స్పందించిన బస్ డ్రైవర్, సదరు వ్యక్తిని బస్సు నుండి బలవంతంగా నేరేళ్ళ గ్రామంలో దింపివేశాడు. ఇదంతా తమ సెల్‌ఫోన్లలో రికార్డ్‌ చేసిన తోటి ప్రయాణికులు వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.. ప్రయాణికుల పై దాడికి దిగాడు..అడ్డువచ్చిన వారి ని నెట్టేశాడు. దీంతో బస్సు లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే.. ఆ తాగు బోతు..ఎవరనే విషయం తెలియడం లేదు. తమపై ఎందుకు దాడికి దిగాడో కూడా తెలియడం లేదంటూ ప్రయాణికులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..