Knowledge: భారతదేశంలో జీరో మైల్‌స్టోన్‌ ఎక్కడుందో తెలుసా.? దీని వెనక ఉన్న అసలు చరిత్ర ఇదే..

Zero Mile Stone: ఒక చోటు నుంచి మరో చోటుకి ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి ఇప్పుడైతే గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps) ఉపయోగిస్తున్నాం. సింపుల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో ఇట్టే దూరాలను తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పటికీ...

Knowledge: భారతదేశంలో జీరో మైల్‌స్టోన్‌ ఎక్కడుందో తెలుసా.? దీని వెనక ఉన్న అసలు చరిత్ర ఇదే..
Zero Milestone History
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 11, 2022 | 2:54 PM

Zero Mile Stone: ఒక చోటు నుంచి మరో చోటుకి ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి ఇప్పుడైతే గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps) ఉపయోగిస్తున్నాం. సింపుల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో ఇట్టే దూరాలను తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పటికీ దారి వెంట వెళ్లే సమయంలో దూరాన్ని తెలుసుకోవడాఇనకి రోడ్డుపై కనిపించే మైలు రాల్లే ఆధారం. వీటి ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎంత దూరం ఉందో తెలుసుకుంటాం. అయితే భారత దేశానికి ఒక చోట జీరో మైల్‌ స్టోన్‌ ఉందనే విషయం మీకు తెలుసా.? అక్కడి నుంచే దేశంలోని పలు నగరాలకు దూరాన్ని లెక్క కడతారు. ఇంతకీ ఆ జీరో మైల్‌స్టోన్‌ ఎక్కడుంది.? ఆ ప్రాంతాన్నే జీరో మైల్‌ స్టోన్‌గా ఎందుకు ఎంచుకున్నారులాంటి ఆసక్తి విషయాలు మీకోసం..

బ్రిటీషర్లు భారత్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తమ పరిపాలన, భద్రతా అవసరాల దృష్ట్యా దేశం మొత్తాన్ని శాస్త్రీయంగా సర్వే చేయించారు. ఇందులో భాగంగానే త్రికోణమితి (ది గ్రేట్ ట్రిగనామెట్రికల్‌ సర్వే) పేరుతో సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగానే నాగ్‌పూర్‌లో జీరో మైల్‌ స్టోన్‌ స్థూపాన్ని నిర్మించారు. 6.5 మీటర్ల ఎత్తైన ఈ స్థూపం పక్కనే రాయిపై 1907 అని ఉంది.

దీని ఆధారంగా ఆ సమయంలో ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థూపం నుంచి దక్షిణ దిక్కులో 62 మైళ్ల దూరంలో కవాథ, ఆగ్నేయంగా 318 మైళ్ల దూరంలో హైదరాబాద్, తూర్పున 125 మైళ్ల దూరంలో చందా, 174 మైళ్ల దూరంలో రాయ్‌పూర్, ఈశాన్యంగా 170 మైళ్ల దూరంలో జబల్‌పూర్, వాయువ్య దిక్కులో 79 మైళ్ల దూరంలో సియోని, 83 మైళ్ల దూరంలో చింద్వార, పశ్చిమాన 101 మైళ్ల దూరంలో బైటుల్ నగరాలు ఉన్నాయి.

Zero Milestone నాగ్‌పూర్ దేశంలోని చెన్నై, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీలకు మధ్యలో ఉండడంతో అక్కడి నుంచే దేశంలోని అన్ని నగరాలకూ దూరాన్ని లెక్కిస్తారు. ఇక అన్ని నగరాలకు జీరో మైల్‌ స్టోన్‌ ఉన్నట్లే హైదరాబాద్‌కు కూడా ఉంది. హైదరాబాద్‌లోని అసెంబ్లీ దగ్గర ఈ జీరో మైల్‌ స్టోన్‌ను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు దూరాన్ని లెక్కించే క్రమంలో అసెంబ్లీని మైల్‌స్టోన్‌గా పరగణిస్తారు.

Also Read: Viral: 24 గంటలు క్రైమ్ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం.. ఎవరికి అవకాశమంటే!

PAN-Aadhaar Linking: ఆధార్-పాన్ లింక్ చేయలేదా.? ఈ 5 నష్టాలు తప్పవు.. అవేంటో తెలుసా!

TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెరిగేనా.. ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు..!