Rajasthan High Court: పిల్లలు కనేందుకు దోషికి పెరోల్.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు..
Rajasthan High Court: దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టులు ఇస్తున్న తీర్పులు ఇటీవల సెన్సెషనల్‌గా నిలుస్తున్నాయి. కొన్ని తీర్పులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. సహాజీవనం, పెళ్లిళ్లు తదితర అంశాలకు
Rajasthan High Court: దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టులు ఇస్తున్న తీర్పులు ఇటీవల సెన్సెషనల్‌గా నిలుస్తున్నాయి. కొన్ని తీర్పులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. సహాజీవనం, పెళ్లిళ్లు తదితర అంశాలకు సంబంధించిన తీర్పులు సంచలనంగా మారాయి. భర్త నుంచి విడాకులు కోరుకున్న భార్య.. సదరు భర్తకు భరణం చెల్లించాలంటూ ఇటీవల ఒక హైకోర్టు తీర్పు ఇస్తే.. అదే సమయంలో మరో హైకోర్టు భార్య.. భర్తకు ఎప్పటికీ సొంతం కాదని.. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎలాంటి హక్కులూ పొందలేరంటూ తేల్చి చెప్పింది. అయితే న్యాయవ్యవస్థలో భార్య భర్తలకు సంబంధించిన తీర్పులు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. అయితే వాటిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తాజాగా.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భార్యతో కలిసి బిడ్డను కనేందుకు జీవితఖైదు అనుభవిస్తున్న భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు.. సంచలన ఉత్తర్వులిచ్చింది. రాజస్థాన్‌కు చెందిన నంద్ లాల్ అనే వ్యక్తి ఓ కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని అజ్మీర్ జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. జిల్లా కమిటీ లాల్‌కు పెరోల్ ఇవ్వలేదు.
దీంతో ఆయన భార్య హైకోర్టుకు వెళ్లింది. పిల్లలు కనేందుకు తన భర్తకు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాల్ భార్య రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు వివాహం అయినా పిల్లలు లేరని, దాంపత్య అవసరాలు తీరేందుకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సంతానాన్ని సృష్టించే ఉద్దేశ్యంతో దాంపత్య సంబంధాలను కలిగి ఉండటం.. దోషిని సాధారణ స్థితికి తీసుకురావడానికి, అతని ప్రవర్తనను మార్చడానికి సహాయపడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్‌ని మంజూరు చేసింది.
దీనిని తిరస్కరించడం ఆమె హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ మేరకు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో పాటు రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌పై లాల్‌ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా.. ఇది ఈ నెల 8న జరగగా.. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
View this post on Instagram
Also Read: