PAN-Aadhaar Linking: ఆధార్-పాన్ లింక్ చేయలేదా.? ఈ 5 నష్టాలు తప్పవు.. అవేంటో తెలుసా!
ఈ మధ్యకాలంలో ఏ పని పూర్తి చేయాలన్నా ఆదార్ కార్డు తప్పనిసరిగా మారింది. అలాగే పాన్ కార్డు కూడా అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్‌లో ఒకటి...
ఈ మధ్యకాలంలో ఏ పని పూర్తి చేయాలన్నా ఆదార్ కార్డు తప్పనిసరిగా మారింది. అలాగే పాన్ కార్డు కూడా అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్‌లో ఒకటి. ఇక ఈ రెండింటిని లింక్ చేయడానికి కేంద్రం మార్చి 31, 2023 వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 1, 2022 నుంచి ఎవరైతే పాన్-ఆధార్‌తో అనుసంధానం చేస్తారో.. వారు కచ్చితంగా పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ(CBDT) 29 మార్చి 2022న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫైనాన్స్ యాక్ట్ 2021లో కొత్త సెక్షన్ 234H జోడించబడింది. ఒకవేళ పాన్ కార్డు నిరుపయోగంగా మారితే వచ్చే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.
- CBDT జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, మార్చి 31, 2023 నాటికి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే.. ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. ఇక చెల్లుబాటు కాని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించలేం.
- రిటర్న్స్‌ను ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా పాన్ కార్డును ఉపయోగించాలి. ఇక ఆ పాన్ కార్డు చెల్లుబాటు అయి ఉండాలి. చెల్లుబాటు కాని పాన్ కార్డులతో రిటర్న్స్ ఫైల్ చేయలేరు.
- పన్ను చెల్లింపుదారుల రిటర్న్స్ పెండింగ్‌లో ఉంటే.. ఆ ప్రక్రియ పూర్తి కావాలన్నా పాన్ కార్డు చెల్లుబాటులో ఉండాలి. చెల్లుబాటు కాని పాన్ కార్డులు దేనికి పనికి రావు.
- మీ పాన్ కార్డు నిరుపయోగంగా మారితే, చాలా చోట్ల ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీడీఎస్ విషయానికొస్తే.. పాన్ కార్డు సమర్పించినట్లయితే, తక్కువ TDS చెల్లించవచ్చు. ఒకవేళ పాన్ కార్డు సమర్పించకపోతే.. టీడీఎస్ రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
- జూన్ 30, 2022 నాటికి తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసిన పన్ను చెల్లింపుదారులు రూ. 500 ఆలస్య రుసుమును చెల్లించాలి. ఆ తర్వాత రెండింటిని లింక్ చేసేవారు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 31, 2023లోగా పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం కాకపోతే.. మీ పాన్ కార్డు చెల్లుబాటు అవ్వదు.