Viral video: అచ్చం మనిషిలాగే సిగరెట్ తాగిన ఒరెంగుటాన్.. వైరల్ వీడియోపై మండిపడుతున్న యానిమల్ లవర్స్..
Viral video: ఒరెంగుటాన్లు చూడడానికి అచ్చం చింపాజీలను పోలి ఉంటాయి. ఇక ప్రవర్తనలో అయితే మనుషుల్లాగే బిహేవ్ చేస్తుంటాయి. సందర్శకులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినడంతో పాటు బాధ కలిగినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటాయి..

Viral video: ఒరెంగుటాన్లు చూడడానికి అచ్చం చింపాజీలను పోలి ఉంటాయి. ఇక ప్రవర్తనలో అయితే మనుషుల్లాగే బిహేవ్ చేస్తుంటాయి. సందర్శకులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినడంతో పాటు బాధ కలిగినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాయి. అందుకే వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిని చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీడియోలో ఒరెంగుటాన్ పొగరాయుడిలా మారిపోయింది. మనిషిలాగా తాపీగా కూర్చోని సిగరెట్ తాగింది. ఇదే యానిమల్ లవర్స్, నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అసలే అంతరించిపోయే దశలో ఉన్న ఒరెంగుటాన్లకు సిగరెట్ ఎలా దొరికింది? జూ నిర్వాహకులు ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దానిని కూడా బానిసగా మారుస్తారా?
వియత్నాంలోని హోచిమిన్ సిటీలోగల సైగాన్ జూ, బొటానికల్ గార్డెన్స్ ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఒరెంగుటాన్ నేలపై కూర్చొని ఉంది. సిగరెట్‌ను అచ్చం మనిషిలాగే రెండు వేళ్లతో పట్టుకుని తాగడం మనం చూడవచ్చు. అయితే జూ సందర్శకుడు పడేసిన సిగరెట్‌ను ఒరెంగుటాన్ తీసుకొని తాగిందని, జూ సిబ్బంది దానికి సిగరెట్ ఇవ్వలేదని జూ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో బాగా చక్కర్లు కొడుతోంది. అయితే జూ నిర్వాహకులు చెబుతున్నా జంతు ప్రేమికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ‘అసలే ఒరెంగుటాన్లు అంతరించిపోయే జీవజాతుల జాబితాలో ఉన్నాయి. అలాంటి స్థితిలో వాటికి సిగరెట్లు ఎలా అందిస్తారు. ఓ జీవిని హానికరమైన పదార్థాలకు బానిసలుగా మారుస్తారా’ అంటూ మండిపడుతున్నారు.




మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
