Viral Video: ఒక్క సెకన్…ఒకే ఒక్క సెకన్‌లో విషాదం.. రోడ్డుపై వెళ్తున్న తండ్రి కుమార్తెపై పడ్డ చెట్టు
ఒక్క సెకన్ వ్యవధిలోనే ఢిల్లీలో విషాదం ముసురుకుంది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతుళ్లపై భారీ చెట్టు కూలి తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురు తీవ్ర గాయాలతో విలవిల్లాడింది. నట్ట నడిరోడ్డు మీద జరిగిన ఈ ఘోర దృశ్యం చూసినవాళ్లు షాక్‌కు గురయ్యారు.

ఒక్క సెకన్. ఒకే ఒక్క సెకండ్. యస్, ఒక్క సెకండులో చాలా సంఘటనలు జరుగుతాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. మృత్యువు ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. బైక్ మీద ముందు వెళ్లిన వాళ్లు తప్పించుకున్నారు. ఎదురుగా వచ్చినవాళ్లు సురక్షితంగా వెళ్లిపోయారు. నిమిషాలు కాదు..జస్ట్ సెకన్ల వ్యవధిలోనే బైక్ మీద వెళుతున్న ఆ తండ్రీకూతుళ్ల మీద చెట్టు కూలింది. ముందు వెళ్లినవాళ్లు వెళ్లిన సెకన్‌కే వీళ్లు వెళ్లారు. ఒక్క సెకన్ వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది. నట్ట నడిరోడ్డు మీద ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా? బైక్ అలాగే ఉండిపోయింది. కింద పడలేదు. కానీ బైక్ మీద ఉన్న వ్యక్తి ఆ చెట్టు కింద నలిగిపోయి చనిపోయారు. తండ్రి ప్రాణాలు కోల్పోతుంటే.. బైక్ మీద వెనకే కూర్చున్న కూతురు కూడా తీవ్ర గాయాలతో విలవిల్లాడిపోయింది. తండ్రి చనిపోయిన బాధ ఓ వైపు, తీవ్ర గాయాలతో చెట్టు కింద ఇరుక్కుపోయి ఆమె పడ్డ నరకయాతన మరోవైపు…సంఘటనా స్థలంలో ఉన్నవాళ్లంతా ఆ దృశ్యాలు చూసి విచలితులయ్యారు.
హెచ్చరిక: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు.. సున్నిత మనస్కులు చూడకండి
#WATCH | Two people were injured after a tree uprooted near Paras Chowk in the Kalkaji area earlier today, after heavy rainfall in Delhi.
CCTV footage confirmed by the Police. pic.twitter.com/O2Ttu8HDhD
— ANI (@ANI) August 14, 2025
ఈ సంఘటన చూసినవాళ్లు పరుగుపరుగున వచ్చారు స్థానికులు. మానవత్వం ఉన్నవాళ్లంతా సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. తండ్రీకూతుళ్లను చిదిమేస్తున్న ఆ చెట్టు కొమ్మను తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అటు వాళ్ల ప్రయత్నాలు సాగుతుండగానే బాధితురాలు నరకయాత అనుభవించారు.
అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి చనిపోయారు. ఈ యాక్సిడెంట్‌లో తండ్రి చనిపోగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ యువతిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు పక్కనే ఉండే ఆ చెట్టు…రోజు తమ ప్రయాణానికి మౌనసాక్షిలా ఉండే ఆ వృక్షం…ఇలా తన తండ్రిని చిదిమేస్తుందని, తనను ఆస్పత్రి పాలు చేస్తుందని ఆ యువతి ఎన్నడూ ఊహించి ఉండదు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకపోయినా, ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది ఈ యాక్సిడెంట్. దేశ రాజధాని కల్కాజీలో ఈ యాక్సిడెంట్ జరిగింది.
