ఇల్లెక్కిన మొసలి… ఎందుకంటే!

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాల్లో వరదలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు నిత్యావసరాలు లేక అల్లాడుతున్నారు. అయితే ఈ వరదల వల్ల మనుషులే కాదు, జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బెలగావిలోని రాయ్‌బాగ్ ప్రాంతంలో కనిపించిన దృశ్యం, కర్ణాటకలోని వరద దుస్థితిని కళ్లకు కడుతోంది. ఓ మొసలి వరద నీటిలో కొట్టుకొచ్చి ఓ ఇంటికప్పును ఆశ్రయం చేసుకొని సేద తీరుతోంది. […]

ఇల్లెక్కిన మొసలి... ఎందుకంటే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2019 | 7:10 PM

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాల్లో వరదలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు నిత్యావసరాలు లేక అల్లాడుతున్నారు. అయితే ఈ వరదల వల్ల మనుషులే కాదు, జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బెలగావిలోని రాయ్‌బాగ్ ప్రాంతంలో కనిపించిన దృశ్యం, కర్ణాటకలోని వరద దుస్థితిని కళ్లకు కడుతోంది. ఓ మొసలి వరద నీటిలో కొట్టుకొచ్చి ఓ ఇంటికప్పును ఆశ్రయం చేసుకొని సేద తీరుతోంది. ఆ ప్రాంతంలో వచ్చిన వరదలకు అక్కడి ఇళ్లు దాదాపుగా నీళ్లలోనే మునిగాయి. ఇంటి పైకప్పులు మాత్రమే నీటిలో ఆకులు తేలినట్లుగా కనిపిస్తున్నాయి. అలాంటి ఓ ఇంటి పైకప్పును ఆసరా చేసుకున్న మొసలి బతుకు జీవుడా అనుకుంది.