Telugu News Trending conductor treated the passenger video was gone viral in social media Telugu News
Video Viral: ప్రయాణీకులంటే మరీ ఇంత చులకనా.. దారుణంగా కొట్టి, కాలితో తన్ని.. కండక్టర్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు
'ప్రయాణీకులే మా దేవుళ్లు, వారిని గమ్య స్థానాలకు చేర్చడమే మా పని' అనే స్లోగన్స్ ను మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తూనే ఉంటారు. ప్రయాణీకులకు మర్యాద ఇచ్చి వారితో గౌరవంగా నడుచుకుంటారు. అయినా కొన్ని సార్లు ప్రయాణీకులకు...
‘ప్రయాణీకులే మా దేవుళ్లు, వారిని గమ్య స్థానాలకు చేర్చడమే మా పని’ అనే స్లోగన్స్ ను మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తూనే ఉంటారు. ప్రయాణీకులకు మర్యాద ఇచ్చి వారితో గౌరవంగా నడుచుకుంటారు. అయినా కొన్ని సార్లు ప్రయాణీకులకు, బస్ కండక్టర్ మధ్య ఏదో ఒక విషయంలో ఘర్షణ జరుగుతుంటుంది. చిల్లర ఇవ్వలేదనే కారణంతో చాలా వరకు గొడవలు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో (Video) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బస్సు కండక్టర్ ఒక ప్రయాణీకుడితో అనుచితంగా ప్రవర్తించడాన్ని చూడవచ్చు. అతనిని చెంపదెబ్బ కొట్టడమే కాకుండా బస్సులోంచి కిందికి దింపేస్తాడు. కాలితో తన్ని దారుఁగా ప్రవర్తిస్తాడు. అంతటితో ఆగకుండా డోర్ మూసేసి బస్ డ్రైవర్‌ను వెళ్లమని చెప్తాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి, బస్సు కండక్టర్ మధ్య గొడవ జరుగుతుంది. అతనిని బస్సు దిగిపోవాలని కండక్టర్ సూచించాడు. అయితే అతడు కిందకు దిగేందుకు ఒప్పుకోడు. దీంతో కండక్టర్ (Conductor) తీవ్ర ఆగ్రహానికి గురై అతని చెంపపై గట్టిగా కొడతాడు. అంతే కాకుండా బస్సు నుంచి కిందికి దింపి వెళ్లిపోతాడు. ఆపై బస్సు తలుపు మూసివేస్తాడు. తర్వాత ప్రయాణికుడిని అదే స్థితిలో వదిలేసి వెళ్లిపోతాడు.
ఈ వైరల్ వీడియో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 14 వేలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఆ సంఖ్య పెరుగుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కండక్టర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకుడి పట్ల అతను వ్యవహరించిన తీరు సరిగా లేదని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.