Mamata Banerjee in Durga Puja: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆసేతు హిమాచలం భక్తులు అమ్మవారి స్మరణలో మునిగితేలుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరిమదిలోనూ ముందుగా మెదిలేది పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా. రాష్ట్ర వ్యాప్తంగా మండపాలు ఏర్పరచి అమ్మవారి పూజిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గా పూజను చేశారు. కోల్‌కతాలో జరిగిన కమ్యూనిటీ పూజ ప్రారంభోత్సవంలో బెనర్జీ సాంప్రదాయ వాయిద్యమైన ధక్ (డ్రమ్) ను వాయించారు.
దీదీ తన సహచర క్యాబినెట్ మంత్రులు ఫ్రిహాద్ హకీమ్, అరూప్ బిస్వాస్‌తో కలిసి సురుచి శంఖ పూజను నిర్వహించారు. అక్కడ దీదీ ఇతర డ్రమ్ వాయిద్యకారులతో కలిసి కలిసి డ్రమ్ ను వాయించారు. హకీమ్ కూడా మమతా బెనర్జీతో కలిసి డ్రమ్ వాయిద్యాలను వాయించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
డ్రమ్ వాయిస్తున్న దీదీ:
#WATCH | West Bengal CM Mamata Banerjee played a dhak during the inauguration of Suruchi Sangha Puja Pandal in Kolkata earlier today. State Minister and Kolkata Mayor Firhad Hakim also joined her in playing the instrument. #DurgaPuja pic.twitter.com/W5ciwCR3Fd
— ANI (@ANI) September 28, 2022
పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ఆర్ధికంగా ఇబ్బందులతో ఉన్నప్పటికీ ప్రభుత్వం దుర్గాపూజ నిర్వహణ కమిటీలకు ఇచ్చే గ్రాంట్‌ను రూ.50,000 నుండి రూ.60,000కి పెంచింది. దుర్గా పూజ సందర్భంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10 వరకు సెలవులు ప్రకటించారు సీఎం మమతా బెనర్జీ.
మమతా బెనర్జీ మాట్లాడుతూ 9 రోజుల పాటు నిర్వహించే ఈ పండుగను యునెస్కో ప్రతినిధి జాబితాలో చేర్చినందున.. దుర్గాపూజను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..