Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: చైనాలో డ్రైవింగ్ లైసెన్స్‌ పొందడం ఇంత కష్టమా.? టెస్ట్ డ్రైవ్‌ ట్రాక్‌ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ఏ దేశంలోనే అయినా డ్రైవింగ్ లైసెన్స్‌ పొందడానికి ఒక చట్టపరమైన వ్యవస్థ ఉంటుంది. అక్కడి ప్రభుత్వం ఆదేశాల మేరకు కొన్ని కండిషన్స్‌ ఉంటాయి. వాటికి అనుగుణంగానే ప్రజలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందిస్తారు. కంటి చూపు వంటి శారీరక ధృడత్వంతో పాటు...

Watch Video: చైనాలో డ్రైవింగ్ లైసెన్స్‌ పొందడం ఇంత కష్టమా.? టెస్ట్ డ్రైవ్‌ ట్రాక్‌ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 08, 2022 | 4:51 PM

ఏ దేశంలోనే అయినా డ్రైవింగ్ లైసెన్స్‌ పొందడానికి ఒక చట్టపరమైన వ్యవస్థ ఉంటుంది. అక్కడి ప్రభుత్వం ఆదేశాల మేరకు కొన్ని కండిషన్స్‌ ఉంటాయి. వాటికి అనుగుణంగానే ప్రజలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందిస్తారు. కంటి చూపు వంటి శారీరక ధృడత్వంతో పాటు, రోడ్డు భద్రతపై ఎంత మేర అవగాహన ఉందన్న విషయాన్ని గమినించేందుకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే చివరగా టెస్ట్ డ్రైవింగ్‌ను సైతం తప్పకుండా నిర్వహిస్తారు. ఒక వ్యక్తికి నిజంగానే వాహనం నడిపే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవడమే ఈ టెస్టింగ్ డ్రైవ్‌ ప్రధాన ఉద్దేశం.

ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా రెండు రౌండ్లు వేసి ఇలా వెళ్లి అలా వచ్చేలా ఈ ట్రాక్‌లను డిజైన్‌ చేస్తారు. అయితే చైనాలో అధికారులు ఏర్పాటు చేసిన టెస్ట్ డ్రైవ్‌ ట్రాక్‌ చూస్తే కళ్లు బైర్లు కమ్మడం మాత్రం ఖాయం. చైనాలో టెస్టింగ్ డ్రైవ్‌ ట్రాక్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింగ తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

టెస్ట్‌ డ్రైవింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్‌పై వాహనాన్ని నడపడం పెద్ద సాహసమే అనిపించేలా ఉంది. తికమతికమలతో కూడిన ట్రాక్‌ చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రివర్స్‌ గేర్‌లో కొద్దిసేపు, రౌండ్ షేప్‌లో ఉన్న ట్రాక్‌లో కొద్దిసేపు సాగిన టెస్ట్ డ్రైవ్‌ ట్రాక్‌పై వాహనం నడపడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వామ్మో మన దగ్గర మాత్రం ఇలాంటి కఠినమైన ట్రాక్స్‌లేవు మైగాడ్ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..