AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రోబోతోనే గేమ్సా? చెస్ ఆడుతుండగా వేలు విరగ్గొట్టేసింది.. నెట్టింట వైరల్..

Russia Chess Playing Robot: ఏడేళ్ల చిన్నారి సేఫ్టీ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. రోబోట్ ఆడే సమయంలో ఒక కదలికకు బాలుడు ప్రయత్నించినట్లు అధికారులు వివరించారు.

Watch Video: రోబోతోనే గేమ్సా? చెస్ ఆడుతుండగా వేలు విరగ్గొట్టేసింది.. నెట్టింట వైరల్..
Robot Broke 7 Year Old Boy's Finger In Moscow
Follow us
Venkata Chari

|

Updated on: Jul 24, 2022 | 4:11 PM

Russia Chess Playing Robot: రష్యాలో జరుగుతున్న చెస్ టోర్నమెంట్‌లో ఓ రోబో 7 ఏళ్ల బాలుడి వేలును విరిచేసిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ అబ్బాయి పేరు క్రిస్టోఫర్. అతను జులై 19న మాస్కోలో ప్రారంభమైన మాస్కో ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. రోబో కదలకముందే క్రిస్టోఫర్ తన ఎత్తుగడ వేస్తున్నట్లు చూడొచ్చు. ఈ క్రమంలో రోబో తన పావును పెడుతున్న సమయంలో ఆ అబ్బాయి చేయి ఇరుక్కుపోయింది. ఇది గమనించిన పక్కనే నిల్చున్న కొందరు బాలుడి వేలిని రోబో నుంచి విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

క్రిస్టోఫర్ గేమ్‌కు సంబంధించిన భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించాడని, అందుకే రోబోట్ బాలుడి వేలిపై పడిందని రష్యన్ చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సెర్గీ స్మాగిన్ న్యూస్ వీక్‌తో తెలిపారు. బాలుడు నిర్ణీత సమయం నుంచి తన వేగాన్ని మార్చడం ప్రారంభించాడు. ఈ సమయంలో పావును కదలడం రోబో వంతని వారు తెలిపారు. అయితే, ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ సందర్భాలలో జరుగుతాయని, ఇది మాత్రం మొదటిసారి అని చెప్పుకొచ్చారు. పిల్లాడి గాయం గురించి స్మాగిన్ మాట్లాడుతూ.. ఆందోళన చెందాల్సిన పని లేదు. గాయం తర్వాత కూడా ఆడడం, సంతకం చేయడం, వేడుకల్లో ఆ బాలుడు పాల్గొన్నాడని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మాస్కో టాప్-30 ఆటగాళ్లలో క్రిస్టోఫర్..

క్రిస్టోఫర్ అండర్-9లో మాస్కో 30 మంది బలమైన చెస్ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుగాంచాడు. ఈ సంఘటన తర్వాత, అతని వేలు విరిగింది.

న్యాయం కోసం తల్లిదండ్రుల పోరాటం..

రష్యన్ మీడియా ప్రకారం, క్రిస్టోఫర్ తల్లిదండ్రులు మాస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మేం సమస్యను పరిష్కరిస్తామని, అన్ని విధాలుగా వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తామని రష్యన్ చెస్ ఫెడరేషన్ ఈ సందర్భంగా పేర్కొంది.

శిక్షణ కోసం రోబోలు..

ప్రస్తుతం టేబుల్ టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, చెస్‌తో సహా అనేక ఇతర క్రీడలలో రోబోట్‌లను ఉపయోగిస్తున్నారు. ఇంకా ఏమిటంటే, ఆటగాళ్ళు తమ శిక్షణను బలోపేతం చేయడానికి రోబోట్‌లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రోబో ఛాంపియన్‌షిప్‌లు కూడా జరుగుతున్నాయి.