AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జాన్ సీనా 2.O.. కుక్క- పిల్లి మధ్యలో భీకర పోరు.. గెలుపెవరిదో అస్సలు ఊహించలేరు..

కుస్తీ పోటీల నేపథ్యంలో తీసిన దంగల్ సినిమా గుర్తుందా? బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది.

Watch Video: జాన్ సీనా 2.O.. కుక్క- పిల్లి మధ్యలో భీకర పోరు.. గెలుపెవరిదో అస్సలు ఊహించలేరు..
Dog Vs Cat
Shiva Prajapati
|

Updated on: Nov 10, 2022 | 3:31 PM

Share

కుస్తీ పోటీల నేపథ్యంలో తీసిన దంగల్ సినిమా గుర్తుందా? బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. భారీ కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కుస్తీ పోటీలు మన దేశంలో సర్వసాధారణం. మన సంస్కృతిలో, సంప్రదాయంలో భాగం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పండుగల సందర్భాల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ కుస్తీ ఇప్పుడు ప్రపంచ వ్యాపితం అయ్యింది. ఒలింపిక్స్‌లో కీలక గేమ్‌గా మారింది. ఇక డబ్ల్యూడబ్ల్యూఈ(World Wrestling Entertainment) పేరుతో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖ వ్రెస్ట్‌లర్స్ తమ సత్తా చాటుతున్నారు. జాన్ సీనా, ది అండర్‌టేకర్, ఎడ్జ్, పాల్ వైట్ వంటి దిగ్గజాలు ఉన్నారు. భారత్‌కు చెందిన ది గ్రేట్ ఖలీ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొదారు. ఈ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు గెలుచుకుని భారత ఖ్యాతిని మరింత పెంచారు.

అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే.. మనుషులే కాదు.. జంతువులు కూడా కుస్తీ పడుతాయి. వాటి ఫైటింగ్ మామూలుగా ఉండదు. చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. మనుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా పక్కా టెక్నిక్స్‌తో ప్రత్యర్థులపై తలపడుతాయి. అవును, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనను భయపెట్టడానికి వచ్చిన కుక్కకు పట్టపగలే చుక్కలు చూపించింది పిల్లి. కుస్తీలో ఆరితేరిన సీనియర్ మాదిరిగా.. ఒకే ఒక స్టంట్‌తో కుక్కను మట్టికరిపించింది పిల్లి. ఓ చెట్టు వద్ద పిల్లి తన పాటికి తాను సేదతీరుతుండగా.. కుక్క వచ్చింది. ఆ పిల్లిని బెదిరించే ప్రయత్నం చేసింది. ఏమాత్రం బెదరని పిల్లి.. ఆ కుక్కపై అరిచింది. అక్కడున్నది కుక్క కదా.. అది కూడా బెదరలేదు. దాంతో ఇక లాభం లేదు అనుకుందో ఏమో గానీ.. పిల్లి తన ట్యాలెంట్‌ను అంతా చూపించేసింది. కుస్తీలో మాదిరిగా తన ముందరి కాళ్లతో కుక్క మెడను బంధించి ఒక్క ఉదుటున తిప్పి పడేసింది. పిల్లి దెబ్బకు ఆ కుక్క పల్టీలు కొట్టింది. పిల్లి ఇచ్చిన షాక్‌తో బిత్తరపోవడం కుక్క వంతు అయ్యింది. 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్లి, కుక్క పోరును చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దంగల్ 2.O అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పిల్లిని ఒలింపిక్స్‌కు పంపితే గోల్డ్ మెడల్ పక్కా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ సూపర్ క్యాట్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..