బాహుబలి ఎద్దే అనుకుంటే ఇది దాన్నే మించిపోయింది.. ఏకంగా రోడ్డుపై ఆపి ఉన్న కారునే..
సోషల్ మీడియా సరికొత్త వీడియోలకు సరైన వేదిక. కాదేదీ అనర్హం అన్నట్లుగా వివిధ రకాల వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రపంచం చాలా అద్భుతాలతో కూడిన విభిన్న ప్రపంచం. ఇందులో అప్ లోడ్...

సోషల్ మీడియా సరికొత్త వీడియోలకు సరైన వేదిక. కాదేదీ అనర్హం అన్నట్లుగా వివిధ రకాల వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రపంచం చాలా అద్భుతాలతో కూడిన విభిన్న ప్రపంచం. ఇందులో అప్ లోడ్ అయ్యే మెసెజ్ లు, ఫొటోలు, వీడియోల ద్వారా మనకు సమాచారంతో పాటు వినోదం కూడా లభిస్తుంది. ఈ వీడియోలు మనల్ని జీవితంలో ఎదుర్కొనే టెన్షన్‌ల నుంచి కాస్త రిలాక్స్ కలిగిస్తాయి. వీటిలో జంతువుల వీడియోలను సోషల్ మీడియాలో చూసేవారు కూడా ఉంటారు. భూమిపై అత్యంత శక్తివంతమైన జంతువు అనగానే మనకు ఠక్కున ఏనుగు గుర్తొస్తుంది. ఏనుగు పెద్ద వృక్షాన్ని కూడా తన తొండం తో పెకిలించే శక్తి ఉంది. అడవి రాజైన సింహం కూడా దానిని ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. కానీ మనం అత్యంత శక్తివంతమైన, చురుకైన జంతువు గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ లిస్ట్ లో ఎద్దు మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎద్దుల విధ్వంసాన్ని చూపించే వివిధ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉంటాయి.
ఎద్దు చాలా బలమైన జంతువు. జల్లికట్టు ఆటలో వీటి తెగువ, బలం చూశాం. ఇవి ఒక్కసారిగా ఎటాక్ చేస్తే ఎంతటి వారైనా నేలకూలాల్సిందే. అయితే మనుషుల వరకు ఓకే.. కానీ వెహికిల్స్ పై ప్రతాపం చూపిస్తే.. రిజల్ట్ మాత్రం ఇలానే ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో లో ఓ ఎద్దు రోడ్డుపై ఆపి ఉన్న కారును తన కొమ్ములతో ఎత్తి కింద పడేస్తుంది. ఎద్దు తన కోపాన్ని కారు పై తీవ్రంగా చూపించింది. కారు దగ్గరకు వెళ్లిన ఎద్దు తన కొమ్ముతో వాహనాన్ని గాలిలోకి విసిరేసింది. ఇలా కొన్నిసార్లు చేసి, కారును బలంగా ఢీ కొట్టింది. అక్కడ ఉన్న వారు వెంటనే అలర్ట్ అవడంతో ఎద్దును అక్కడి నుంచి తరిమేశారు.




View this post on Instagram
వైరల్ అవుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. వీడియో కు ఇప్పటి వరకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.