ఈ విశాల ప్రపంచంలో ప్రతి జీవి మరొక జీవిపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో ఒడుదొడుకులు. అడవిలోని జంతువుల మధ్య ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. భూమిపై నివసిస్తున్న ఏ జీవి జీవితం అంత సౌకర్యంగా లేదు. బతుకు కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ క్రమంలో జంతువుల మధ్య జాతి వైరం ఏర్పడింది. కుక్కలు, పిల్లులు బద్దశత్రవులన్న విషయం మనందరికీ తెలిసిందే. కుక్కను (Dog) చూడగానే పిల్లి మెల్లగా అక్కడ్నుంచి జారుకుంటుంది. ఇక కుక్క పిల్లిని చూడగానే తరిమి తరిమి వెంటాడుతుంది. అయితే ఈ రెండూ కలిసిమెలిసి చట్టాపట్టాలేసుకుంటూ తిరిగేస్తే.. ఆహా.. ఎంత బాగుంటుందో కదా.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. బద్దశత్రవులైన ఈ జీవులు రెండూ మంచి స్నేహితులుగా మారి చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లిని కుక్క ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. జాతి వైరాన్ని మర్చిపోయి ఎంతో స్నేహంగా మెలుగుతోంది. కుక్కను చూసి ఆమడదూరం పారిపోయే పిల్లి కుక్కతో కలిసి మెలిసి తిరగడం, కుక్క ఆ పిల్లిని ఎంతో ఆప్యాయంగా చూడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వాటి స్నేహానికి ముగ్దులవుతున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెంలో జరిగింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి