అందుకే చెప్పేది.. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేవలం నడిచేటప్పుడు మాత్రమే కాదు. డ్రైవ్ చేస్తున్నా అప్రమత్తంగానే ఉండాలి. ఇది మీకు మాత్రమే కాదు.. ఇతరులకూ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో రోడ్డు ప్రమాదాల..
రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేవలం నడిచేటప్పుడు మాత్రమే కాదు. డ్రైవ్ చేస్తున్నా అప్రమత్తంగానే ఉండాలి. ఇది మీకు మాత్రమే కాదు.. ఇతరులకూ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో రోడ్డు ప్రమాదాల కేసులు అధికమయ్యాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తేలింది. అదే సమయంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశ వ్యాప్తంగా 4 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వీటిలో 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తేలింది. అందుకే డ్రైవింగ్‌లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రజలు మాత్రం నిబంధనలు మరిచిపోతున్నారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కారు రోడ్డు పై వేగంగా వెళ్తోంది. అదే సమయంలో అటు వైపు నుంచి లారీ కూడా స్పీడ్ గా వస్తోంది. అవి ఒక మలుపు వద్దకు చేరుకోగానే భయానక ప్రమాదం జరిగింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కారు రోడ్డుపై వెళ్తుండటాన్ని చూడవచ్చు. అటు వైపు నుంచి ఒక ట్రక్కు రావడం కూడా మనకు కనిపిస్తుంది. రోడ్డుపై మలుపు వచ్చిన ప్రదేశంలో కారు డ్రైవర్ బ్యాలెన్స్ తప్పి నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో పెద్దగా పేలుడు సంభవించింది. రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో, ట్రక్ లో ఉన్న వారికి గాయలయ్యాయి. ప్రమాదం తీవ్రత చూస్తుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉందనే విషయం అర్థమవుతోంది.
— Vicious Videos (@ViciousVideos) October 15, 2022
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 29 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 15 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి