AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లాటరీలో వచ్చిన రూ.30 కోట్లను గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

అదృష్టం కలిసొచ్చింది.. లాటరీలో ఏకంగా రూ.30 కోట్లు వచ్చాయి. ఏడాదిన్నర కాలంగా తనతో లీవ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న ప్రియురాలిని పూర్తిగా నమ్మి.. ఆ డబ్బు ఆమె అకౌంట్లో వేశాడు. అయితే ఆమె అతనికి ఊహించని షాకిచ్చింది. 30 కోట్లు అకౌంట్లో పడగానే ఆమె మరో ప్రియుడితో పారిపోయింది.

Viral: లాటరీలో వచ్చిన రూ.30 కోట్లను గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Lottery
Ravi Kiran
|

Updated on: Jun 03, 2025 | 12:08 PM

Share

అదృష్టం కలిసొచ్చింది.. లాటరీలో ఏకంగా రూ.30 కోట్లు వచ్చాయి. ఏడాదిన్నర కాలంగా తనతో లీవ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న ప్రియురాలిని పూర్తిగా నమ్మి.. ఆ డబ్బు ఆమె అకౌంట్లో వేశాడు. అయితే ఆమె అతనికి ఊహించని షాకిచ్చింది. 30 కోట్లు అకౌంట్లో పడగానే ఆమె మరో ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన కెనడాలో జరిగింది. ఈ విన్నిపెగ్‌కు చెందిన లారెన్స్ కాంప్‌బెల్ అనే వ్యక్తి 2024లో ఒక లాటరీ టిక్కెట్‌ కొన్నాడు. ఆ లాటరీలో అతనికి జాక్‌పాట్‌ తగిలింది. అందులో అతనికి 5 మిలియన్ల కెనడియన్‌ డాలర్లు, అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 30 కోట్లు లాటరీలో వచ్చింది. తనకు బ్యాంక్‌ అకౌంట్‌ లేకపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ మెక్కే అకౌంట్లో ఆ డబ్బు జమ చేశాడు. అంతా బాగానే అనిపించింది. ఆ జంట షాపర్స్ డ్రగ్ మార్ట్‌లో విజయాన్ని ధృవీకరించే వీడియో కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

భారీమొత్తంతో కూడిన ఆ చెక్కుతో ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. మెక్కే ఈ ఫోటోల్లో పెద్దగా ఉత్సాహంగా కనిపించనప్పటికీ, ఈ విజయాన్ని మిస్టర్ కాంప్‌బెల్ ఆమెకు ఇచ్చిన పుట్టినరోజు బహుమతిగా బహిరంగంగా ప్రకటించాడు. ఆ డబ్బు అకౌంట్లో పడిన తర్వాత మెక్కే మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో లారెన్స్ కాంప్‌బెల్ ఆమెపై కోర్టులో కేసు వేశాడు. డబ్బు అకౌంట్లో పడిన తర్వాత మెక్కే అదృశ్యమైందని కాంప్బెల్ కోర్టుకు వెల్లడించాడు. ఆమె తాము ఉంటున్న హోటల్ గదికి తిరిగి రాలేదని, తన ఫోన్‌ను లిప్ట్‌ చేయడం లేదని, తనను సోషల్‌ మీడియాలో కూడా అన్ని చోట్లా బ్లాక్‌ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె కోసం వెతగ్గా.. చివరికి ఆమె వేరొక వ్యక్తితో ఓ హోటల్‌లో మరో వ్యక్తితో కనిపించిందని తెలిపాడు. ఈ సందర్భంగా క్యాంప్‌బెల్ తరపు న్యాయవాది.. కోర్టులో ఆమె అతన్ని మోసం చేసిందని, అతను ఫోన్‌ చేసినా అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, అంతేకాకుండా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలన్నిటిలో క్యాంప్‌బెల్‌ను బ్లాక్ చేసిందని అన్నారు. మరి ఈ కేసులో క్యాంప్‌బెల్‌కు కోర్టు ఎలా న్యాయం చేస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్