Viral Pic: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టండి.! చాలామంది ఫెయిల్ అయ్యారు..

సోషల్ మీడియాలో పిక్చర్ పజిల్స్ ట్రెండ్ ఇప్పటిది కాదు. లాక్‌డౌన్ కారణంగా అది కాస్తా వైరల్‌గా మారింది. ప్రజలు తమ ఖాళీ సమయాన్ని..

Viral Pic: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టండి.! చాలామంది ఫెయిల్ అయ్యారు..
Viral Pic 1

Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2021 | 6:31 PM

ప్రతీ రోజూ ఏదొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అవి నెటిజన్లకు పరీక్ష పెడతాయి. అసలు అందులో ఏముంది.? ఉంటే ఎక్కడ దాగి ఉందని.. కనిపెట్టడంలో జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పిక్చర్ పజిల్స్ వారికి ప్రతీసారి థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తాయి.

లాక్‌డౌన్ సమయంలో పిక్చర్ పజిల్స్ ట్రెండ్ సృష్టించాయి. ప్రజలు తమ ఖాళీ సమయాన్ని పూర్తి చేసేందుకు, మెదడుకు పదును పెట్టేందుకు ఎన్నో రకాల పజిల్స్‌ను సాల్వ్ చేస్తున్నారు. అలాంటి ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగి ఉంది. నెటిజన్లు దానిని కనిపెట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓసారి మీరు కూడా లుక్కేయండి.!

ఆస్ట్రేలియాకు చెందిన సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ నెటిజన్లకు ఓ సవాల్ విసిరారు. తాము తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇందులో పాము ఎక్కడుందో కనిపెట్టాలంటూ పజిల్ ఇచ్చారు. ఈ వైరల్ పిక్‌లో కాల్చిన, ఎండిన కర్రలు ఉన్నాయి. అందులో పాము నక్కి ఉంది. దాన్ని కనిపెట్టాలని నెటిజన్లకు సవాల్ విసిరారు. ఇది ఫోటోషాప్‌లో రూపొందించింది కాదని.. రియల్ ఫోటో అని స్పష్టం చేశారు. చాలామంది నెటిజన్లు ఈ పజిల్‌ను సాల్వ్ చేయాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.

Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..