
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 3 సెకన్లలోపే ఇంగ్లిష్ ఆల్ఫాబెట్‌ను రివర్స్ ఆర్డర్‌లో టైప్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో, అతను కేవలం 2.88 సెకన్లలో Z నుంచి A వరకు టైప్ చేయడం చూడవచ్చు. ఈ అరుదైన ఘనతను హైదరాబాద్‌కు చెందిన షేక్ అష్రాఫ్ సొంతం చేసుకున్నాడు. రెప్పపాటులో అతను 26 లెటర్స్ అవరోహణ క్రమంలో టైప్ చేయడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అతను Z నుంచి స్టార్ట్ చేసి A తో ముగించాడు. అతను సూపర్ స్పీడ్‌లో ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి తీసుకున్న సమయం కేవలం 2.88 సెకన్లు.
వీడియో దిగువన చూడండి…
అష్రాఫ్ తన డెస్క్‌టాప్‌పై ఆల్ఫాబెట్స్‌ను స్పీడ్‌గా టైప్ చేయడం మీరు చూడవచ్చు. ఊపిరి తీసుకుని.. వదిలేంత సమయంలో అతను కీ బోర్డ్‌పై తన చేతివేళ్లతో అద్భుతాన్ని చేశాడు. అతను మూడు సెకన్ల కంటే తక్కువ సమయంలో ఈ ప్రపంచ రికార్డును సెట్ చేయడానికి సాధారణ QWERTY బేస్డ్ కీబోర్డ్‌నే ఉపయోగించడం వీడియోలో చూడవచ్చు. మే 2న ఇన్ స్టాలో షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే 39,000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. ” ఇది నమ్మశక్యం కాని రికార్డు” అని ఒకరు పేర్కొన్నారు. ‘హైదరాబాద్ బిగినర్స్‌కు కాదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘బాస్‌కి కీ బోర్డ్ ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందో తెలుసుకోవాలని ఉంది’ అని మరొకరు కామెంట్ పెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..