Viral Video: మండపంలో వధువు చేసిన పనికి అంతా షాక్.. వామ్మో ఏకంగా తుపాకీ తీసుకుని.. వీడియో వైరల్..

కానీ పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు చేసిన పనికి అక్కడున్నవారంత షాకయ్యారు. మండపంలో ఏకంగా తూపాకీతో కాల్పులు జరిపింది.

Viral Video: మండపంలో వధువు చేసిన పనికి అంతా షాక్.. వామ్మో ఏకంగా తుపాకీ తీసుకుని.. వీడియో వైరల్..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 04, 2022 | 11:20 AM

ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని చూసేందుకు ఎంతో సరదాగా ఉండగా.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. పెళ్లిళ్లో బంధువులు, సన్నిహితులు చేసే సరదా పనులు.. అల్లరి ఆటలు ముచ్చటేస్తుంటాయి. ఇక వధూవరులతో కలిసి స్నేహితులు చేసే కొన్ని ఫన్నీ గేమ్స్ నవ్వులు పూయిస్తుంటాయి. కానీ పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు చేసిన పనికి అక్కడున్నవారంత షాకయ్యారు. మండపంలో ఏకంగా తూపాకీతో కాల్పులు జరిపింది. వేదికపై నిలబడి తుపాకితో కాల్పులు జరిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో పెళ్లి మండపంలో వధువు తూపాకీతో కాల్పులు జరిపింది. ఆమె కాలుస్తున్న సమయంలో అందరు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఆమె కాల్పులు జరుపుతున్న సమయంలో వరుడు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. అయితే వీడియో చూస్తుంటే పెళ్లి ఆచారంలో భాగంగా వధువు అలా రైఫిల్ కాల్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వధువు ధైర్యం చూసి నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.