AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ జంట డ్యాన్స్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే.. నడిరోడ్డుపై పోటా పోటిగా చిందులు.. ఇదేం స్టైల్..

సాధారణంగా పెళ్లిలో బరాత్ తీయడం కామన్.. అలాగే పెళ్లిలో ఇరు కుటుంబాలు ఎంతో సంతోషంగా చిందులు వేస్తుంటారు

Viral Video: ఈ జంట డ్యాన్స్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే.. నడిరోడ్డుపై పోటా పోటిగా చిందులు.. ఇదేం స్టైల్..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2021 | 2:11 PM

Share

సాధారణంగా పెళ్లిలో బరాత్ తీయడం కామన్.. అలాగే పెళ్లిలో ఇరు కుటుంబాలు ఎంతో సంతోషంగా చిందులు వేస్తుంటారు. ఆనందంతో వయసు మరిచి డాన్స్ చేస్తుంటారు. వధువు వరుడు కూడా.. తమ జీవితంలో అతి ప్రత్యేకమైన రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజున ఎంతో ఉత్సాహంతో ఇద్దరు కలిసి చిందులు వేస్తుంటారు. అయితే ఈ సంబరాల్లో ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుంటాయి. ముఖ్యంగా వధువు వరుడు చూడముచ్చటగా చేసే డాన్స్ చూసేందుకు అక్కడున్నవారంత ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల.. వరుడు, వధువు డాన్స్‏కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో జంటలు.. అందంగా స్టెప్పులేస్తూ.. తమ సంతోషాన్ని ఆనందిస్తుంటారు. అయితే కొన్ని జంటల డాన్స్ చూస్తే మాత్రం కామెడిగా అనిపిస్తుంటుంది.. కొన్ని వీడియోలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూస్తే మాత్రం మీరు నవ్వకుండా ఉండలేరు. ఆ వీడియోలో ఆఫ్రీకన్ దేశానికి చెందిన ఓ అమ్మాయి.. భారతీయ వ్యక్తిని మన సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి.. మన సంప్రదాయంలో ఇరు కుటుంబాల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక వివాహం అనంతరం.. రోడ్డుపై వరుడు డాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇక పెళ్లి కొడుకు డాన్స్ చూసిన వధువు తనను తాను నియంత్రించుకోలేక.. వెంటనే డాన్స్ చేయడం ప్రారంభించింది. ఇద్దరు కలిసి ఎంతో ఉత్సాహంగా ఒకరిని మించి ఒకరు డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. డాన్స్ చేస్తే అందులో ఫన్నీ ఏముంది అనుకుంటున్నారా ? నిజమే.. కానీ ఇక్కడ వారిద్దరు వేసిన స్టెప్పులు చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోను శివమ్ శివమ్ అనే యూజర్ తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. వధువరుల డాన్స్ పై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

ఇన్‏స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by shivam (@shivamshivam8450)

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‏కు అరుదైన బహుమతి.. 160 ఏళ్ల పురాతన కానుక ఇచ్చి అభిమానాన్ని చాటుకున్న కేరళ మిలియనీర్..

Naga Chaitanya: మా ప్రయాణం ఆగిపోతుందని బాధగా ఉంది.. ఈ జర్నీని ఆపొద్దు.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..