Viral Video: శోభనం గదిలో వధువు ప్రశ్నకు షాకైన వరుడు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!

Viral Video: పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులను ఈ బంధం ముడివేస్తుంది. అలా ఏర్పడిన ఈ బంధం జీవితంలో ఓ భాగమవుతుంది...

Viral Video: శోభనం గదిలో వధువు ప్రశ్నకు షాకైన వరుడు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!
Bride
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 04, 2021 | 7:21 AM

పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులను ఈ బంధం ముడివేస్తుంది. అలా ఏర్పడిన ఈ బంధం జీవితంలో ఓ భాగమవుతుంది. అందుకే వివాహానికి సంబంధించిన ప్రతీ మూమెంట్ పదిలంగా ఉండేందుకు చాలామంది వీడియోలు తీస్తుంటారు. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో వధువు అడిగిన ప్రశ్నకు వరుడు, బంధువులను అయోమయంలో పడేసింది. ఆ తర్వాత కడుపుబ్బా నవ్వేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంగరంగ వైభవంగా ఓ పెళ్లి వేడుక జరిగింది. అతిధులు విచ్చేసి నవ వధూవరులను ఆశీర్వదించారు. తతంగం మొత్తం అనుకున్నట్లే జరిగింది. ఇక ఆ రాత్రి జరగాల్సిన కార్యానికి అంతా సిద్దం చేశారు. శోభనం గదిని రకరకాల పూలతో అలంకరించారు. వరుడు ఏకంగా మంచాన్ని గులాబీ రేకులతో కప్పేశాడు. ఇంతలా సిద్దం చేసిన గదిలోకి వధువు ఎంటరై ”సోయెంగే కహా పె’ అంటూ ప్రశ్న అడిగింది. దీనితో అక్కడున్న వరుడు బిట్టరపోగా.. బంధువులు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ‘dulhaniyaa’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విమర్శలు గుప్పించగా.. మరికొందరు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తించారు.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!