
ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో కొంత మంది మాత్రమే బిలినీయర్లుగా ఎదిగారు. కోటీశ్వరులుగా ఎదిగిన చాలా మందిలో వారి అలవాట్లు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగలకు మాత్రం కట్టుబడే ఉంటున్నారు. వారిలో బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా ఒకరు. ముఖేష్ అంబానీ ఎంత కోటీశ్వరుడైనప్పటికీ ఎప్పుడూ తన పిల్లలతో గడపడానికి అవకాశాల కోసం చూస్తుంటాడని, కొన్నిసార్లు తన పిల్లలకు తానే వ్యాపార గురువుగా మారుతాడు.. ఇంకొన్నిసార్లు వారికి డ్రైవర్‌గా కూడా మారిపోతాడు. ఇందుకు సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అదేంటంటే..
ముఖేష్ అంబానీకి రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ కార్లతో సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిని నడిపేందుకు కూడా వందలు, వేల సంఖ్యలోనే డ్రైవర్లు కూడా ఉన్నారు. కానీ,ఒకరి అతనే స్వయంగా డ్రైవర్ అవతారమెత్తాడు ముఖేష్ అంబానీ, మెర్సిడెస్ కారులో డ్రైవర్ సీటులో అంబానీ కూర్చొని ఉండగా ఆయన కుమార్తె ఇషా అంబానీ అతని పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. లక్షల కోట్ల ఆస్తులున్న ముకేశ్ అంబానీ తన కూతురు కోసం డ్రైవర్‌గా మారడం అందరినీ షాక్ కి గురి చేసింది.. అయితే కోటీశ్వరుడు అయిన ముకేశ్ అంబానీ తన కూతురు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని వీడియో చూసిన చాలా మంది అంటున్నారు. ముఖేష్ అంబానీ, ఇషాల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూడండి..
ఈ ఏడాది ప్రారంభంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రూ. 12 కోట్ల విలువైన వ్యక్తిగత రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIని కొనుగోలు చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, వ్యవస్థాపకుడికి చెందిన రెండవ రోల్స్ రాయిస్ ఇది. గతేడాది దీపావళి నాడు ముఖేష్ అంబానీ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చాడు.. తాజాగా దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాను వెల్లడించిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులతో మొదటి స్థానంలో ఉండగా, ముఖేష్ అంబానీ రెండవ స్థానం.