ధూమ్ సినిమా స్టైల్‌లో చోరీకి ప్లాన్‌ చేశాడు.. రూ.15కోట్ల వస్తువులు మడతపెట్టేశాడు.. చివరికి పడిపోయాడు..!

మ్యూజియంలో దాదాపు రూ.50 కోట్ల విలువైన వస్తువులు భద్రపరిచారు. ఈ వస్తువుల్లో రూ.15 కోట్లు చోరీకి గురైంది. 49 ఏళ్ల వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడు. అతను దాదాపు 6 నెలలుగా దీని కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. గత 6 నెలలుగా అతను తన కొడుకుతో కలిసి ప్రతిరోజూ మ్యూజియంకు వెళ్లేవాడు. అలా అక్కడ ఉన్న భద్రత గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు.

ధూమ్ సినిమా స్టైల్‌లో చోరీకి ప్లాన్‌ చేశాడు.. రూ.15కోట్ల వస్తువులు మడతపెట్టేశాడు.. చివరికి పడిపోయాడు..!
Museum Thief Fall 25 Feet W
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 05, 2024 | 1:10 PM

మీరు చాలా సినిమాల్లో వెరైటీ స్టైల్స్‌లో దొంగతనాలు జరగడం చూసే ఉంటారు. చోరీలను విభిన్న స్టైల్లో చూపించిన ధూమ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాలో జరిగింది. ఇక్కడ స్టేట్ మ్యూజియంలో రూ.15 కోట్లు చోరీకి గురైంది. లూటీ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు ఓ ఎత్తైన గోడను ఎక్కాడు. అక్కడి నుంచి కిందకు దూకుతుండగా వెన్నెముక విరిగిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

భోపాల్‌లోని స్టేట్ మ్యూజియంలో దాదాపు రూ.50 కోట్ల విలువైన వస్తువులు భద్రపరిచారు. ఈ వస్తువుల్లో రూ.15 కోట్లు చోరీకి గురైంది. వినోద్ అనే 49 ఏళ్ల వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడు. అతను దాదాపు 6 నెలలుగా దీని కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. గత 6 నెలలుగా అతను తన కొడుకుతో కలిసి ప్రతిరోజూ మ్యూజియంకు వెళ్లేవాడు. అలా అక్కడ ఉన్న భద్రత గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. ప్లాన్‌ అమలు చేయాలని భావించాడు. అతను దొంగతనం చేసిన ఆ రోజు ఆదివారం.

ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న ఆయుధాలతో రెండు గదుల తాళాలు పగులగొట్టాడు. ఈ రెండు గదుల్లోని దాదాపు రూ.15 కోట్ల విలువైన వస్తువులను సర్దేసుకున్నాడు. అనంతరం అతను 25 అడుగుల ఎత్తైన గోడను ఎక్కి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతను ఈ గోడ ఎక్కాడు.. కానీ అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్టుగా వినోద్‌కి మరో సమస్య ఎదురైంది. చోరీ జరిగిన మర్నాడు సోమవారం కూడా మ్యూజియం మూసి ఉంటుంది. దాంతో అతను సుమారు రెండు రోజుల పాటు తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో అక్కడే పడి ఉన్నాడు.

ఆ మరుసటి రోజు మ్యూజియం తాళం తీయగానే అందరూ షాక్ అయ్యారు. మ్యూజియంలో చోరీ జరిగినట్టుగా గుర్తించారు సిబ్బంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మ్యూజియం వద్దకు చేరుకున్న పోలీసులు అంతట పరిశీలించగా రెండు గదుల తాళాలు పగులగొట్టి అందులో ఉంచిన బంగారు, వెండి, పాత ఆభరణాలు, నాణేలు మాయమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మ్యూజియంకు అవతలి వైపు గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న వినోద్ యాదవ్‌ను గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వినోద్‌ యాదవ్‌ గత 6 నెలలుగా ధూమ్ సినిమా చూస్తూ.. ఈ దొంగతనానికి ప్రిపేర్‌ అయినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే చోరీకి ముందు వినోద్ మ్యూజియంలోని లోటుపాట్లన్నీ జాగ్రత్తగా గమనించాడని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC