AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి వేసిన రోడ్డు.. ఇలా ఏడ్చింది! ఎక్కడో కాదు.. మన దగ్గరే..?

బీహార్‌లోని జెహానాబాద్‌లో రూ.100 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లను తొలగించకుండా రోడ్డు నిర్మించడంపై విమర్శలు వస్తున్నాయి. అటవీ శాఖ అనుమతి లేకపోవడం, పరిహారం ఇవ్వలేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి వేసిన రోడ్డు.. ఇలా ఏడ్చింది! ఎక్కడో కాదు.. మన దగ్గరే..?
Trees Between Road
SN Pasha
|

Updated on: Jun 30, 2025 | 6:05 PM

Share

సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇలాంటి కేవలం ఇండియాలోనే సాధ్యం అంటూ వాటికి క్యాప్షన్లు కూడా ఇస్తుంటారు నెటిజన్లు. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మరీ ఇంత బుద్ధి తక్కువగా ఎలా ఉంటారు అనిపించేలా ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఏదో చేశాం అంటే చేశాం అనేలా పనులు మమ అనిపించి.. లక్షలు, కోట్ల బిల్లు దొబ్బేస్తుంటారు.

తాజాగా అలాంటిదే ఓ నిర్వాహకం బయటపడింది. ఏకంగా వంద కోట్లతో రోడ్డు వేసి.. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లను అలానే వదిలేసి.. వాటి మధ్యలో కూడా తారు వేసి వెళ్లిపోయారు. ఆ రోడ్డుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రవిచిత్రమైన రోడ్డు నిర్మాణ పనులు బీహార్‌లోని జెహానాబాద్‌లో జరిగాయి. రాజధాని పాట్నా నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఈ రోడ్డు రూ.100 కోట్లతో నిర్మించారు.

జెహానాబాద్‌లో పాట్నా-గయా ప్రధాన రహదారిపై 7.48 కిలో మీటర్‌ పొడవైన రహదారి మధ్యలో చెట్లు ఉన్నాయి. వాటిని అలాగే వదిలేసి.. రోడ్డు వేసేశారు. జిల్లా యంత్రాంగం రూ.100 కోట్ల రోడ్డు విస్తరణ ప్రాజెక్టును చేపట్టినప్పుడు, వారు చెట్లను తొలగించడానికి అనుమతి కోరుతూ అటవీ శాఖను సంప్రదించారు. కానీ అటవీ శాఖ అందుకు అనుమతి ఇవ్వలేదు. ఆ చెట్లను నరికితే ప్రతిగా అటవీ శాఖ 14 హెక్టార్ల అటవీ భూమికి పరిహారం డిమాండ్ చేసింది. అయితే జిల్లా యంత్రాంగం ఆ అభ్యర్థనను నెరవేర్చలేకపోయింది. పైడి చెట్లను అలాగే ఉంచేసి.. రోడ్డు వేసేశారు. రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఉండటం వల్ల ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అయితే జిల్లా యంత్రాంగం చెట్లను తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక పెద్ద ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!