AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అసెంబ్లీని పేల్చేసినట్టు ఏఐ వీడియో క్రియేట్.. కట్‌చేస్తే.. కటకటాలపాలైన యువకుడు!

ప్రస్తుతం రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ, ఏఐ.. కొందరు ఈ ఏఐ వాడి మంచి పనులు చేస్తుంటే.. మరి కొందరు అదే ఏఐ వాడి నేరాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఆ ఏఐతో చేసిన వీడియోలతో ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా ఇలానే ఏఐ వీడియోను క్రియేట్ చేసిన ఓ యువకులు చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

Viral Video: అసెంబ్లీని పేల్చేసినట్టు ఏఐ వీడియో క్రియేట్.. కట్‌చేస్తే.. కటకటాలపాలైన యువకుడు!
Man Arrested For Fake Ai Video Of Assembly Explosion
Anand T
|

Updated on: Oct 22, 2026 | 3:12 PM

Share

అసెంబ్లీ పేలిపోయినట్టు ఏఐ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని బీహార్ చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేశారు కర్ణాటక పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని అరేరియా జిల్లాకు చెందిన హజ్రత్ అలీ షోయబ్ అనే యువకుడు కొన్నాళ్ల క్రితం బెంగళూరు వచ్చి అక్కడే రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. అయితే తాజాగా ఇతను కర్ణాటక అసెంబ్లీ భవనాన్ని పేల్చేసినట్టు ఓ ఏఐ వీడియోను క్రియేట్ చేశారు.

ఆ వీడియోను jnx_king_h_g అనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయిటేల్స్‌ ద్వారా ఆ యువకుడి వివరాలు సేకరించి పోలీసులు.. అనంతరం అతని మొబైల్ నెంబర్ ద్వారా అతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు.

వీడియో ఎందుకు క్రియేట్ చేశాడు, దాని వెన ఉన్న ఉద్దేశం ఏంటనేది తెలుసుకునేందుకు ప్రస్తతం అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అలాగే ఈ వీడియో ఇతన్నొక్కడే క్రియేట్ చేశారా?.. దీనికి మరెవరైనా సహకరిచారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us