AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Anveshana: ‘నా అన్వేషణ’ యూట్యూబర్‌కి లవ్ సింబల్స్ పంపిన రతిక.. ఏంటి కథ మేడమ్

ఇటీవలి కాలంలో కొద్దో గొప్పో ఫాలోవర్స్ వచ్చారంటే.. వాళ్లంతా మనీ కోసం బెట్టింగ్ యాప్‌లను ఇతరత్రా అన్ అఫీషియల్ ప్రొడెక్ట్‌లను ప్రమోట్ చేస్తుంటారు. అయితే తనకి కోట్లలో ఫాలోవర్స్ ఉన్నప్పటికీ.. ‘నా అన్వేషణ’ యూట్యూబర్ మాత్రం ఇలాంటి వాటిని ప్రోత్సహించడు. కానీ ఇప్పుడు....

Naa Anveshana: ‘నా అన్వేషణ’ యూట్యూబర్‌కి లవ్ సింబల్స్ పంపిన రతిక.. ఏంటి కథ మేడమ్
Naa Anveshana - Rathika Rose
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2024 | 8:31 PM

Share

ఇప్పుడు.. నెట్టింట మోస్ట్ ట్రెండింగ్ పర్సన్ ఎవరంటే.. యూట్యూబర్ అన్వేష్. 160 పైగా దేశాలు చుట్టి వచ్చిన.. అన్వేష్‌ను 1.4 మిలియన్ల మంది ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. 20 లక్షల మంది యూట్యూబ్‌లో అనుసరిస్తున్నారు. 300 మిలియన్ వ్యూస్‌ ఉన్నాయి. అందుకే అతడు ఏ వీడియో పట్టినా ఇట్టే వైరల్ అవుతుంది. ఇతగాడి బాడీ లాంగ్వేజ్.. భాష, యాస అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే అంత క్రేజ్ వచ్చింది. అన్వేష్ సంపాదన అయితే కోట్లలో ఉంది. అయితే ఇంతవరకు ఏ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు ఈ టాప్ యూట్యూబర్. ఇతను అనౌన్స్ చేసిన ఓ ఆఫర్.. ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అదేం అల్లాటప్పా ఆఫర్ కాదండోయ్.  తన ఫాలోవర్స్‌ ఏకంగా 100 ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటన చేశాడు. అది కూడా ఐఫోన్ 15 అట. ఇండియాను లాంచ్ అవ్వబోయే ఓ సెల్‌ఫోన్ కంపెనీ వాళ్లు ప్రమోషన్ చేయమని.. అన్వేష్‌ను కోరారట. జస్ట్ వాళ్లు తన ఫొటోతో పాటు చవక చవక అనే డైలాగ్‌ని వాడుకుంటానని చెప్పడంతో.. అందుకు అన్వేష్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అందుకు గానూ రిటన్ గిఫ్ట్ కింద 100 ఐ ఫోన్‌లు ఫ్రీగా ఇస్తానని ఆ కంపెనీ వాళ్లు అన్వేష్‌కు మాట ఇచ్చారట. వాటిని తన ఫాలోవర్స్‌కు ఇచ్చేందుకు నా అన్వేషణ డిసైడయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు. దాని కింద ఏదో ఒకటి కామెంట్ చేస్తే.. లాటరీ తీసి వంద మందికి ఐఫోన్‌లను అందిస్తాని చెప్పాడు. వచ్చే వారం పేర్లను లాటరీ ద్వారా అనౌన్స్ చేస్తా అని విడియో పెట్టాడు. దీంతో ఆ వీడియో కింద కామెంట్ల వర్షం కురుస్తుంది. ఏకంగా  1 మిలియన్ కామెంట్లు వచ్చాయి.  వీళ్లలో సెలబ్రిటీలు కూడా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌ రతిక రోజ్ సైతం.. ‘నా అన్వేషణ’ వీడియో కింద లవ్ సింబల్స్ పెట్టింది. రతికా అని లవ్ సింబల్‌తో పాటు.. ‘నా అన్వేషణ’ అంటూ లవ్ సింబల్స్ పెడుతూ రెండు కామెంట్స్ పెట్టింది. దీంతో రతిక సైతం ఐఫోన్ కోసం ఆశపడుతుంది అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

80 లక్షల రూపాయిల ఖరీదు చేసే ఫోన్లను ఇలా  ఫ్రీ ఇస్తానని వీడియో పెట్టడంతో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఏప్రిల్ ఫూల్ అనవ్‌గా మావ అని కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..