Viral Video: ఎవర్రా మీరంతా.. ఛీ.. ఛీ.. నడి రోడ్డుపైనే రొమాన్స్ దుకాణం ఓపెన్ చేశారు.. వీడియో చూస్తే..

రోజురోజుకీ యువత ఆగడాలు మితిమీరుతున్నాయి. అందరూ చూస్తున్నారన్న సంగతి మర్చిపోయి..నడిరోడ్డుపైనే రెచ్చిపోతున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తూ నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. బైక్ లపై ప్రయాణిస్తూ.. అబ్బాయిల అమ్మాయిలూ వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి..

Viral Video: ఎవర్రా మీరంతా.. ఛీ.. ఛీ.. నడి రోడ్డుపైనే రొమాన్స్ దుకాణం ఓపెన్ చేశారు.. వీడియో చూస్తే..
Bengaluru Viral Video

Updated on: Feb 27, 2025 | 6:43 PM

రోజురోజుకీ యువత ఆగడాలు మితిమీరుతున్నాయి. అందరూ చూస్తున్నారన్న సంగతి మర్చిపోయి..నడిరోడ్డుపైనే రెచ్చిపోతున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తూ నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. బైక్ లపై ప్రయాణిస్తూ.. అబ్బాయిల అమ్మాయిలూ వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి.. బైక్ పై ప్రయాణిస్తూ ముద్దులు, హగ్గులు లాంటి రోమాన్స్ తో రెచ్చిపోతున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు మనం చాలానే చూశాం.. అలాంటి మరో ఘటన తాజాగా.. కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగ‌ళూరులో న‌డిరోడ్డుపై ప్రేమికుల జంట రెచ్చిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. బెంగళూరులో ఒక యువకుడు తన బైక్ ఫ్యూయిల్ ట్యాంక్‌పై ఒక యువతిని కూర్చోబెట్టుకుని.. ఆమెను కౌగిలించుకుంటూ మోటార్ సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. దీంతో ఈ వీడియో నెట్టింట దుమారం రేపింది..

బెంగ‌ళూరులోని రద్దీ ప్రాంతమైన స‌ర్జాపుర మెయిన్ రోడ్డులో ఓ ప్రేమ జంట ఇలా రొమాన్స్ చేసుకుంటూ క‌నిపించ‌డంతో ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో రికార్డు చేసి.. వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. దీంతో ఇది నెట్టింట‌ వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు ప్రేమికుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అస‌లు క్ష‌మించ‌కూడ‌ద‌ంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఇలా నిర్ల‌క్ష్యంగా ప్ర‌యాణిస్తున్న ఆ జంట‌పై బెంగళూరు పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. బైక్ తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అయితే.. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనే సమాచారం మాత్రం తెలియరాలేదు.. కానీ యువత ఇలాంటి ప్రమాదకరమైన రీతిలో హద్దు మీరి ప్రవర్తిస్తుండటంపై పలువు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. నెట్టింట ఈ వీడియో వైరల్ అవ్వడంతో బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..