AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మహాశివరాత్రి వేళ శివాలయం ముందు తల వంచి మోకరిల్లిన ఎద్దు.. భక్తి పారవశ్యంలో భక్తులు!

మహాశివరాత్రి శుభ సందర్భంగా, శివాలయం ముందు తల వంచి నిలబడి ఉన్న ఎద్దును చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందీశ్వరుడు స్వయంగా భోలేనాథ్ కు నమస్కరించి తన 'ప్రణామం' అర్పిస్తున్నట్లు అనిపిస్తుందంటూ.. భక్తులు పరవశించిపోతున్నారు. దీనిని ఆ పరమశివుడికి అంకితం చేసినట్లుగా భావిస్తున్నారు.

Watch: మహాశివరాత్రి వేళ శివాలయం ముందు తల వంచి మోకరిల్లిన ఎద్దు.. భక్తి పారవశ్యంలో భక్తులు!
Bull In Shiv Temple[1]
Balaraju Goud
|

Updated on: Feb 27, 2025 | 6:27 PM

Share

ఫిబ్రవరి 26న, అంటే గత బుధవారం నాడు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ ఉత్సాహం, శుభ సందర్భం మధ్య, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రజలు ఇది ఇప్పటివరకు అత్యుత్తమ వీడియో అని కితాబు ఇస్తున్నారు. ఇందులో శివుని ఆలయం ముందు ఒక ఎద్దు నిలబడి దండం పెట్టుకుంది. ఆ క్లిప్ చూసిన తర్వాత, ఆ నందీశ్వరుడు స్వయంగా భోలేనాథ్ కు నమస్కరించి తన ‘ప్రణామం’ అర్పిస్తున్నట్లు అనిపిస్తుంది.. ఈ వీడియో చూసిన భక్తులు షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, శివుని ఆలయం ముందు ఒక నల్ల ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దు ముందు కాళ్ళను మడిచి, తలను క్రిందికి వంచింది. వీడియోలో ఎద్దు తన తలను పూర్తిగా నేలపై ఉంచినట్లు చూడొచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఎద్దు శివుడికి ‘నమస్కరిస్తున్నట్లు’ భావిస్తున్నారు.

శివాలయంలో ఎద్దు ప్రత్యేక దృశ్యంః

ఈ సంఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆలయం ముందు ఎద్దు అదే భంగిమలో కనిపిస్తుంది. అయితే, ఆ వీడియో మహాశివరాత్రి రోజున రికార్డ్ చేసిందా లేదా మరేదైనా రోజున రికార్డ్ చేశారా అనేది స్పష్టత లేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వారందరూ ఆగి తమ ఫోన్లలో దానిని బంధించిన దృశ్యాలు వీడియోలో కనిపించింది.

@Ravitiwariii_ ex హ్యాండిల్ నుండి షేర్ చేసిన ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఎద్దు పూర్తిగా శివుడికి లొంగిపోయిందని నెటిజన్లు అంటున్నారు. జంతువుల ప్రవర్తన అనూహ్యమైనది. కొన్నిసార్లు, వాటి అసమంజసమైన ప్రవర్తనతో ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. ఈ వైరల్ వీడియో దానికి రుజువు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..