Viral: బిచ్చగాడి చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. చెక్ చేయగా పెట్రోలింగ్ పోలీసులకు షాక్..

యాచికుడే కదా.. ఏముంటుందిలే అనుకుని వదిలేయాలనుకున్న పోలీసులకు గట్టి షాక్ తగిలింది. అతడి దగ్గరున్న ప్లాస్టిక్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా..

Viral: బిచ్చగాడి చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. చెక్ చేయగా పెట్రోలింగ్ పోలీసులకు షాక్..
Represantative Image
Image Credit source: Represantative Image

Edited By: Ram Naramaneni

Updated on: Jun 16, 2022 | 8:31 AM

అతడొక యాచకుడు.. రోజూ ఆలయాల దగ్గర భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని సాగిస్తుంటాడు. అయితే ఓ రోజు రాత్రి సదరు వ్యక్తి ఒక చోట నుంచి వేరే ప్రాంతానికి వెళుతుండగా.. పెట్రోలింగ్ పోలీసులు అతడ్ని ఆపుతారు. అంతేకాదు పలు ప్రశ్నలను సైతం సంధిస్తారు పోలీసులు. అయితే తాము అడిగిన ప్రశ్నలకు బిచ్చగాడి నుంచి పొడిపొడి సమాధానాలు రావడంతో.. పోలీసులకు అనుమానమొచ్చి అతడి దగ్గరున్న ప్లాస్టిక్ బ్యాగ్‌ను చెక్ చేస్తారు. వాళ్లు నిర్ఘాంతపోయేలా ఆ సంచిలో రెండు కవర్లలో కుప్పలుగా డబ్బుల మూటలు బయటపడ్డాయి. అసలు సంగతి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని ఫరీదాబాద్ పోలీసులకు బుధవారం విచిత్ర సంఘటన ఎదురైంది. పెట్రోలింగ్ చేస్తోన్న సమయంలో ఓ బిచ్చగాడు చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్‌ పట్టుకుని అటూ.. ఇటూ తిరుగుతూ వారికి కనిపించాడు. ముందుగా అతడ్ని పెద్దగా పట్టించుకోని పోలీసులు.. సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆపి ప్రశ్నలు అడిగారు. ఎక్కడ నుంచి వస్తున్నావ్.? బ్యాగ్‌లో ఏమైనా గన్ ఉందా.? అంటూ అడగ్గా.. బిచ్చగాడు వాటికి సరిగ్గా సమాధానాలు చెప్పలేదు. దీనితో పోలీసులు అతడి దగ్గరున్న ప్లాస్టిక్ బ్యాగ్‌ను తెరిచి చూడగా.. అందులో డబ్బు మూటలతో నిండి ఉన్న రెండు పాలిథిన్‌ సంచులు కనిపించాయి. వాటిల్లో ఉన్న దాదాపు రూ. 50 లక్షల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే ఆదాయపు పన్ను శాఖ అధికారులను రంగంలోకి దించారు.

ఇవి కూడా చదవండి

విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ రూ. 50 లక్షల డబ్బును, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఎవరు.? ఆ డబ్బు ఎవరిది.? అనే విషయాలు తెలియలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.