రాత్రిళ్లు దొంగలెవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే పెంపుడు కుక్క అరిచి యజమానికి సిగ్నల్ ఇస్తుంది. ఇది రోటీన్.. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు చెందిన ఓ మహిళ విషయంలో మాత్రం ఊహించని షాక్ ఎదురైంది. అపరి చితులెవరో ఇంటి ఆవరణలోకి ప్రవేశించినట్లు తమ పెంపుడుతు కుక్క సిగ్నల్ ఇచ్చింది గానీ వచ్చింది మనిషి కాదు.. ఎలుగుబంటి. ఎలుగు బంటి ఏం దొంగతనం చేస్తుందిలే అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఫుడ్ ట్రక్‌లో ఉన్న ఆహారం, సోడా క్యాన్లను సదరు ఎలుగుబంటి ఊది పారేసింది. వివరాల్లోకెళ్తే..
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో నివాసం ఉంటున్న ఉషరోన్ రోజెల్ అనే మహిళ ఫుడ్ ట్రక్ నడుపుతోంది. తన కారులో శాండ్ విచ్, కూల్ డ్రింక్స్‌తోపాటు కొన్ని ఆహార పదార్ధులు ఉంచి కారుడోర్లు లాక్ చేసి ఇంట్లో నిద్రపోయింది. తెల్లవారుజామున పెంపుడు కుక్క మొరగడంతో రోజెల్ లేచి బయటకు వచ్చింది. ఇంటి ముందు ఉన్న తన కారు అద్దాలు పగిలిపోయి ఉండటం గమనించింది. నిశితంగా చూడగా.. ఓ ఎలుగుబంటి కారు అద్దాలు ద్వంసం చేసి లోపల ఉంచిన 72 సోడాల క్యాన్లను తగడం గమనించింది. ఆహారం కోసం వచ్చిన ఎలుగు బంటి తన కారును ధ్వంసం చేస్తుంటే ప్రేక్షకురాలిగా చూడటం తప్ప ఏమీ చేయలేకపోయింది. అప్పటికే కారులో ఉన్న సోడా క్యాన్లలో ఏకంగా 69 తాగేసింది. దాదాపు గంటన్నరపాటు ఎలుగు బంటి పళ్లతో సోడా క్యాన్ల మూతలు తెరిచి పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసింది.
ఆరెంజ్, కోలా, రూట్‌బీర్ ఇలా పలు బ్రాండ్ల క్యాన్లు ఉండగా వాటిలో ఎలుగు బంటి ఇష్టంగా కొన్నింటిని మాత్రమే తాగింది. డైట్ సోడాలను అస్సలు ముట్టుకోలేదు. ఎలుగు బంటి దాటికి కారు చాలామటుకు ధ్వంసం అయ్యింది. కడుపు నిండిన తర్వాత ఎలుగు బంటి తన దారిన తాను పోయింది. ఇక బాల్కనీ నుంచి ఇదంతా చూస్తున్న రోజెల్ వాటి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ ఎలుగు బంటి ఆహారం దొంగతనం చేయడం.. అందునా అన్ని సోడా క్యాన్లు తాగడం విడ్డూరంగా ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇక జరిగిన నష్టాన్ని పూర్చేందుకు రోసెల్ తన బీమా సాయంతో జరిగిన నష్టాన్ని కనీసం కొంతైనా కవర్ చేసే అవకాశం ఉందని తన పోస్టులో చెప్పుకొచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.