AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లి తప్పించుకుని పారిపోయిన వరుడు.. వధువు ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..!

మీరు కంగనారనౌత్‌ నటించిన క్వీన్ సినిమా చూసే ఉంటారు కదా.. అందులో రాణి పాత్రలో కంగనా రనౌత్ ఎదుర్కొన్న చిత్రమైన పరిస్థితి గుర్తుండే ఉంటుంది.

Viral: పెళ్లి తప్పించుకుని పారిపోయిన వరుడు.. వధువు ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..!
Marriage
Ravi Kiran
|

Updated on: May 23, 2023 | 7:53 PM

Share

మీరు కంగనారనౌత్‌ నటించిన క్వీన్ సినిమా చూసే ఉంటారు కదా.. అందులో రాణి పాత్రలో కంగనా రనౌత్ ఎదుర్కొన్న చిత్రమైన పరిస్థితి గుర్తుండే ఉంటుంది. వివాహం తర్వాత తన భర్త పారిపోతే, కంగనా ఒంటరిగా హనీమూన్‌కు వెళుతుంది. కానీ, ఇక్కడ ఓ యువతి పెళ్లి తప్పించుకుని పారిపోతున్న వరుడ్ని వెంటాడి లాక్కొచ్చి మరీ పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.

యూపీలోని బారాదరి ప్రాంతానికి చెందిన ఈ వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు వైపుల కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదిరింది. మే 21న భూతేశ్వర్ నాథ్ ఆలయంలో వీరికి వివాహం ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలవారూ పెళ్లివేదికకు చేరుకున్నారు. కానీ ముహూర్తం సమీపించినా వరుడి జాడ లేదు. వధువు తనకు కాబోయే భర్త కోసం చూసి చూసి ఇక లాభం లేదనుకుని కాల్ చేసింది. అంతే అవతలనుంచి పెళ్లికొడుకు ఊహించని షాకిచ్చాడు.

‘నువ్వు నన్ను క్షమించాలి, మా అమ్మను తీసుకువచ్చేందుకు బుదాన్ వెళుతున్నాను’ అంటూ పెళ్లి తప్పించుకోడానికి కుంటి సాకులు చెప్పాడు. దాంతో చిర్రెత్తిన పెళ్ళికూతు క్షణం ఆలస్యం చేయకుండా తన వాళ్లను వెంట పెట్టుకుని వరుడి కోసం పరుగెత్తంది. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో భిమోర పోలీసు స్టేషన్ పరిధిలో అతడ్ని పట్టుకుంది. ఓ బస్సు ఎక్కుతుండగా వరుడ్ని పట్టుకుని పెళ్లి మండపానికి లాక్కొచ్చింది. ఇంకేముంది మూడు ముడ్లు, మేళతాళాలు, అక్షింతలతో వివాహం ముగిసింది. వధువు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్