చలికాలం వచ్చిందంటే చాలు ఈ జలుబు, దగ్గు, జ్వరం అన్నీ మొదలవుతాయి. అయితే ముంబైలోని ప్రాణ హెల్త్ కేర్, ఆయుర్వేద అకాడమీలో శ్వాసకోశ సమస్యలకు ఆయుర్వేద నివారణల గురించి పలు సలహా ఇస్తున్నారు. ఊపిరితిత్తులు శ్వాసక్రియకు చాలా అవసరం ఎందుకంటే అవి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని అందిస్తాయి, అలాగే కణాల నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. కాబట్టి ఈ శీతాకాలంలో మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే.. నిపుణుల సూచనలను అనుసరించండి.
పసుపు: ఇది మీ శ్వాసనాళంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడానికి అలాగే శ్వాసలోని కాలుష్య కారకాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
అల్లం: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి అలాగే సాధారణ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శ్వాసకోశ నుండివ్యర్ధాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అదేవిధంగా కాలానుగుణంగా వచ్చే ఫ్లూ , ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
నువ్వుల నూనె: నువ్వుల నూనె ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. దీర్ఘ శ్వాసతో ప్రతి నాసికా రంధ్రంలో రెండు చుక్కల నూనె తీసుకోండి. ఈ ప్రక్రియ నాసికా భాగాలను శుభ్రపరుస్తుంది. ఆయుర్వేదంలో ఈ ప్రక్రియను నాస్య అంటారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.