Auto Funny Quotes: “సారీ గర్ల్స్..” సోషల్ మీడియాను కుదిపేస్తున్న పోస్టర్.. ఆటో డ్రైవర్ ఏం రాశాడో చూస్తే..
మీరు రోడ్డుపై ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు.. ఆటో రిక్షా వెనుక, లారీల వెనుక కొన్ని గమ్మతైన రాతలు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తే మనకు తెగ నవ్వు వస్తుంది.

నన్ను చూసి ఏడువకు.. ఏడువకురా.. నీ కళ్లలో కారం కొట్ట అప్పు చేసి కొన్న.. ఇలాంటి రాతలను మనం చాలా సార్లు చూసి ఉంటాం. కొంతమంది తమాషాగా ఏదైనా రాస్తే.. చాలా మంది కటువుగా రాస్తూ పాపులర్ అవుతారు. ఈ వైరల్ ఫోటోలో అలాంటిదే ఒకటి కనిపించింది. ఇటీవల ఒక ఆటో రిక్షా డ్రైవర్ మహిళల కోసం పోస్ట్ చేసిన “ స్పెషల్” నోటీసు చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ తన ఆటోపై ఇలా రాసుకున్నాడు. ఇది చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. అందులోనూ అమ్మాయిలు ఇదేంటి ఇలా రాసుకున్నాడు. అంటూ చర్చించుకుంటున్నారు. అదే మగ ప్రయాణికులు డ్రైవర్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడని పొగిడేస్తున్నారు.
సోషల్ మీడియా యూజర్ వంశిక గార్గ్ ఇటీవల ఓ ఆటో రిక్షా బ్యాక్ సైడ్ పోస్టర్‌ను పోస్ట్ చేసారు. దాని వెనుక ఇలా రాసి ఉంది. “సారీ గర్ల్స్, నా భార్య చాలా కఠినంగా ఉంటుంది” అని వ్రాయబడింది. నోటీసు చివర్లో మహిళల స్టిక్కర్లపై నిషేధం గుర్తు కనిపించింది. ఈ మెసేజ్ చదివాక చాలా మంది నవ్వు ఆపుకోలేకపోతున్నారు. చాలా మంది యూజర్లు పోస్ట్ చూసిన తర్వాత ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు లైవ్ ఫోటో తీసి పంపుతున్నారు.
ఈ పోస్ట్‌పై చాలా మంది కామెంట్స్ చేశారు
sorry girls, loyalty level max pic.twitter.com/wepmPcDqa7
— Vanshika Garg (@vanshika_garg17) March 5, 2023
పోస్ట్ చూసిన తర్వాత యూజర్లు చాలా మంది ట్వీట్లు పెడుతున్నారు. నా భర్త నుంచి నేను ఆశిస్తున్న విధేయత ఇదే’’ అని ఓ మహిళ రీ ట్వీట్ చేయగా.. మరొక ఢిల్లీకి చెందిన ఓ యూజర్ మరింత లోతుగా రాసుకొచ్చాడు. “ఢిల్లీలో ఇలాంటి పోస్టర్లు, కామెంట్స్ చాలా కనిపిస్తాయంటూ పోస్టు పెట్టడం మరింత ఆశ్చర్యానకి గురి చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం