Viral: టాయిలెట్‌లో కూర్చున్న వ్యక్తికి గుండె ఆగినంత పనైంది.. కళ్లెదురుగా ఊహించని సీన్..
సరీసృపాలలో అతిపెద్ద పాము కొండచిలువ. సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే జనాలు హడలిపోతారు. అలాంటిది కొండచిలువ మనకెదురు వస్తే..
సరీసృపాలలో అతిపెద్ద పాము కొండచిలువ. సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే జనాలు హడలిపోతారు. అలాంటిది కొండచిలువ మనకెదురు వస్తే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. టాయిలెట్‌లో కూర్చున్న ఓ వ్యక్తికి ఊహించని సీన్ ఎదురైంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని ఆక్స్ఎంఫ్రోడ్‌కు చెందిన ఓ వ్యక్తి టాయిలెట్‌కి వెళ్లగా.. అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. సుమారు 6 అడుగుల కార్పెట్ కొండచిలువ దర్శనమిచ్చింది. దీంతో దెబ్బకు హడలిపోయిన ఆ వ్యక్తి.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. స్థానికంగా ఉన్న హడ్సన్ స్నేక్ క్యాచింగ్ సంస్థ అక్కడికి చేరుకొని.. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి.. ఆ కొండచిలువను బంధించారు. ఆయా ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీంతో అవన్నీ కూడా ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేసేయండి.
కాగా, ఆస్ట్రేలియాలో చలికాలం వస్తే చాలు.. కొండచిలువలు సురక్షితమైన ప్రాంతాలను వెతుకుంటాయని.. వేడిగా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటాయని స్నేక్ క్యాచర్ అన్నాడు. అటు కొండచిలువలు సుమారు 13 అడుగుల వరకు పొడవు పెరుగుతాయని.. వాటికి ఎలాంటి హాని తలపెట్టకపొతే.. మనల్ని ఏం చెయ్యవని స్నేక్ క్యాచర్ జాక్సన్ చెప్పాడు. ఇవి ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రంలో తప్ప.. మిగిలిన చోట్ల తరచూ కనిపిస్తాయని అంటున్నారు.