AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్ల కక్కుర్తి పాడుగాను.. పెళ్లి విందులో నాన్‌వెజ్‌ కోసం.. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..!

పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లివేడుకలు, విందు వినోదాలు, ఆడంబరాలు కనిపిస్తున్నాయి. పెళ్లి, విందు కోసం వచ్చే వ్యక్తులు వారి వినోదం, ఆహారం సప్లై విషయంలో జరిగే అనేక సంఘటనలు తరచూగా వార్తల్లో వస్తుంటాయి. అయితే తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రెండు భిన్నమైన ఫుడ్ స్టాల్స్‌లో వింత దృశ్యం కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

వీళ్ల కక్కుర్తి పాడుగాను.. పెళ్లి విందులో నాన్‌వెజ్‌ కోసం.. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..!
Non Veg Stall Opened
Jyothi Gadda
|

Updated on: Dec 01, 2024 | 6:25 PM

Share

పెళ్లి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయిస్తాయి. కొన్నిసార్లు వధువు వీడ్కోలు దృశ్యం ప్రజలను భావోద్వేగానికి గురి చేస్తుంది. మరి కొన్నిసార్లు వరుడి ప్రకోపాలు నవ్వులకు కారణం అవుతాయి. ఇలాంటి వీడియోలు వైరల్‌గా మారడమే కాకుండా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుస్తాయి. కానీ ఈసారి విషయం వేరు. వైరల్ అవుతున్న ఈ వీడియో వరుడి చమత్కారమో, పెళ్లికూతురు వెళ్లిపోవడమో కాదు.. అయితే ఇది పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన వెజ్, నాన్ వెజ్ ఫుడ్‌ స్టాల్స్ వద్ద జరిగిన సంఘటన. అక్కడ జనాలు ఒక వైపు నాన్ వెజ్ స్టాళ్లలో బిజీగా ఉన్నారు. వెజ్ స్టాల్స్ వద్ద మనిషి కూడా లేకపోవడం కనిపించింది.

ఈ వీడియో @swagsedoctorofficial ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇందులో నాన్‌వెజ్‌ స్టాల్‌లో జనం కిక్కిరిసి ఉండడంతో అక్కడ భోజనం చేసేందుకు తోపులాట జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పెళ్లిలో, వెజ్ స్టాల్ వద్ద వెయిటర్లు ఈగలను తోలుకోవటం కనిపించింది.

నాన్ వెజ్ స్టాల్ ముందు పొడవాటి క్యూలైన్లు ఉండడం కనిపించింది. అక్కడ తిండి కోసం ఒకరిపై ఒకరు పడిపోతూ ఆహారం తీసుకోవటం వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు వెజ్ స్టాల్ వద్ద వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా కనిపిస్తోంది. అయితే, ఈ వీడియో ఎక్కడ ఏ సమయానికి చెందినది అనేది స్పష్టంగా తెలియలేదు. అయితే పెళ్లిళ్లలో తిండికి సంబంధించిన ఇలాంటి ఫన్నీ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఆచారాల కంటే ఎక్కువగా, ఫుడ్ స్టాల్స్ వద్ద జనాలు గుమిగూడారు. నాన్‌వెజ్‌ ఫుడ్‌ కోసం కోసం పరుగెత్తుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..