AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!

హోటల్ గదుల్లో లభించే సౌకర్యాలలో ఎలక్ట్రిక్ కెటిల్ ఒకటి. అయితే, దీనిని ఉపయోగించడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం అని హోటల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైకి ఎంతో మెరుస్తూ, శుభ్రంగా కనిపించే ఈ కెటిల్స్‌ వెనుక భయానక వాస్తవాలు దాగివున్నాయి. అవేంటో తెలిస్తే ఇకపై జన్మలో మీరు ఆ కెటిల్స్‌ వైపు కూడా చూడరు. కాబట్టి, ప్రయాణాల్లో ఉన్నప్పుడు హోటల్ కెటిల్స్ వాడకపోవడమే మంచిది. ఇంతకీ అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!
Are Hotel Kettles Safe
Jyothi Gadda
|

Updated on: Jun 26, 2026 | 8:15 PM

Share

మనం ఏదైనా ఊరు వెళ్లినప్పుడు లేదా టూర్‌కు వెళ్లినప్పుడు హోటల్స్‌లో బస చేస్తుంటాం. రూమ్‌లోకి వెళ్లగానే అక్కడ లగ్జరీ బెడ్స్, టీవీలతో పాటు వేడి నీళ్ల కోసం లేదా కాఫీ, టీ తయారు చేసుకోవడానికి ఒక ఎలక్ట్రిక్ కెటిల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ కెటిల్‌ను ఆన్ చేస్తారు. అయితే, ప్రముఖ హోటల్ నిపుణులు, ట్రావెల్ బ్లాగర్స్ ఇస్తున్న తాజా సమాచారం ప్రకారం.. హోటల్ గదిలోని కెటిల్‌ను ఉపయోగించడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఆ వింత ప్రవర్తనే కారణం:

హోటల్ కెటిల్స్ వాడకూడదనడానికి అతిపెద్ద, వికారమైన కారణం ఏమిటంటే.. కొందరు ప్రయాణికుల ప్రవర్తన. సోషల్ మీడియాలో వైరల్ అయిన పలు పోస్టులు, సర్వేల ప్రకారం, చాలా మంది ప్రయాణికులు తమ కిర్తీలు లేదా అంతర్గత దుస్తులు (Undergarments), సాక్స్ వంటి వాటిని త్వరగా ఉతకడానికి లేదా వాటిలోని క్రిములను చంపడానికి ఈ ఎలక్ట్రిక్ కెటిల్స్ లోపల వేసి నీటిని మరిగిస్తున్నారు. వినడానికి అసహ్యంగా ఉన్నా, ఇది నిజమని హోటల్ సిబ్బంది సైతం అంగీకరిస్తున్నారు.

బ్యాక్టీరియా, ఫంగస్ మృత్యుకూపం:

ఒకవేళ బట్టలు ఉతకకపోయినా, కెటిల్‌ను ఉపయోగించిన తర్వాత అందులో మిగిలిపోయిన నీటిని అలాగే వదిలేస్తుంటారు. రోజుల తరబడి నీరు అలాగే నిల్వ ఉండటం వల్ల కెటిల్ అడుగు భాగంలో బయోఫిల్మ్ (Biofilm) అనే ఒక రకమైన జిగట బ్యాక్టీరియా పొర, ఫంగస్ ఏర్పడతాయి. ఇవి సాధారణ కంటికి కనిపించవు.

ఇవి కూడా చదవండి

సిబ్బంది నిర్లక్ష్యం:

హోటల్ రూమ్స్ క్లీన్ చేసే సిబ్బందికి చాలా తక్కువ సమయం ఉంటుంది. వారు బెడ్ షీట్లు మార్చడం, బాత్‌రూమ్ కడగడం, రూమ్ తుడవడంపై శ్రద్ధ పెడతారే కానీ, కెటిల్‌ను ప్రత్యేక డిటర్జెంట్లు లేదా వేడి నీళ్లతో లోపలి వరకు క్లీన్ చేయరు. కేవలం పైపైన గుడ్డతో తుడిచి కెటిల్‌ను మళ్లీ ఉన్నదున్నట్లుగా పెట్టేస్తారు. దీనివల్ల ముందు ఉన్న గెస్ట్‌ల ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా తర్వాతి వారికి సులభంగా వ్యాపిస్తాయి.

ప్రయాణికులకు కొన్ని చిట్కాలు (Travel Safety Tips):

హోటల్‌లో ఉన్నప్పుడు వేడి నీరు లేదా టీ కావాలంటే రూమ్ సర్వీస్‌ను అడిగి నేరుగా కిచెన్ నుండి తెప్పించుకోవడం సురక్షితం. ఒకవేళ కెటిల్ తప్పనిసరిగా వాడాల్సి వస్తే, ఉపయోగించే ముందు అందులో నీళ్లు పోసి కనీసం రెండు మూడు సార్లు బాగా మరిగించి ఆ నీటిని పారబోయాలి. వీలైతే ప్రయాణాల్లో మీతో పాటు చిన్న సైజు పర్సనల్ ఎలక్ట్రిక్ కెటిల్‌ను క్యారీ చేయడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పైకి ఎంతో క్లాసిక్‌గా, క్లీన్‌గా కనిపించే వస్తువుల వెనుక కూడా ఇటువంటి ఆరోగ్య ముప్పులు దాగి ఉంటాయని ఈ వైరల్ వార్త ప్రయాణికులను హెచ్చరిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం