AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పైప్‌లైన్ ఏర్పాటుకు గుంత తవ్వించిన రైతు.. ఆపై వర్షం.. అప్పుడు మెరుస్తూ కనిపించాయ్

ఎటా జిల్లా నిధౌలీ కలాన్ గ్రామంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. యాద్రామ్ అనే రైతు తన భూమిలో పైప్‌లైన్ కోసం తవ్వకాలు చేయించాడు. అయితే కొద్ది రోజులకు వర్షాలు కురిసాయి. ఆ గుంతల్లో వాన నీరు చేరింది. వర్షపు నీటిలో మెరుస్తూ ఏదో కనిపించడాన్ని అటుగా వెళ్లిన ఒక చిన్న పిల్లవాడు గమనించాడు.

Viral: పైప్‌లైన్ ఏర్పాటుకు గుంత తవ్వించిన రైతు.. ఆపై వర్షం.. అప్పుడు మెరుస్తూ కనిపించాయ్
Ancient Coins
Ram Naramaneni
|

Updated on: May 31, 2025 | 1:01 PM

Share

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎటా జిల్లా, నిధౌలీ కలాన్ గ్రామంలో పురాతన నాణేలు బయటపడటంతో గ్రామస్థులు, పోలీసులు, పురావస్తు శాఖ మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సుమారు 15 రోజుల క్రితం స్థానికంగా నివాసం ఉండే యాద్రామ్ అనే రైతు తన భూమిలో సబ్‌మర్సిబుల్ పైప్‌లైన్ ఏర్పాటుకు తవ్వకాలు చేయించాడు. ఆ సమయంలో నాణేలు ఏమీ కనిపించలేదు. అయితే, ఇటీవల కురిసిన వర్షాల తరువాత, ఒక పిల్లవాడికి ఆ ప్రాంతంలో ఏవో మెరుస్తూ కనిపించాయి. ఏంటా అని చూడగా.. అతను ఎప్పుడూ చూడనటువంటి నాణేలు. విషయం గ్రామంలో చెప్పడంతో.. కొందరు పరుగు పరుగున వచ్చి ఆ నాణేలను తీసుకెళ్లి దాచుకున్నారు.

విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామస్తుల నుంచి ఇప్పటివరకు 17 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై పురాతన ఉర్దూ లిపిలో ఏదో రాయబడిందని, ఇవి మొగల్ కాలానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా తవ్వకాలు జరిపితే ఇంకా పురాతన నిధి బయటపడే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నాణేలను పురావస్తు శాఖకు అప్పగించనున్నారు. నాణేల అసలు ప్రాముఖ్యతను, వీటి చరిత్రను తెలియజేయడానికి పురావస్తు నిపుణుల సహాయం అవసరమని భావిస్తున్నారు. గ్రామంలోని కొన్ని కుటుంబాల వద్ద ఇంకా నాణేలు ఉన్నాయన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం నిధౌలీ కలాన్ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు