Viral: రూ. 10 లక్షల కాక్‌టెయిల్.. అంత స్పెషాలిటీ ఏంటనేగా..
తాజాగా ఓ కాక్‌టెయిల్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓ రెస్టరంట్ ఓ కొత్త రకమైన కాక్ టెయిల్‌ను తన మెనూలో చేర్చింది.ఈ కాన్‌టెయిల్ ధర ఏకంగా రూ. 10 లక్షలు కావడం విశేషం. ఇంతకీ ఈ కాక్ టెయిల్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటి.? అంత ధర ఎందకనేగా మీ డౌట్. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
కస్టమర్లను ఆకర్షించేందుకు హోటల్ నిర్వాహకులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రీమియం కస్టమర్లను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఆహార పదార్థాలను తయారు చేస్తుంటారు. ఇందులో భాగంగానే బంగారం పూతతో కూడిన పాన్‌లు, కేక్‌లను తయారు చేస్తుంటారు. ఇలాంటి వాటికి మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. వీటిని కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు.
తాజాగా ఓ కాక్‌టెయిల్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓ రెస్టరంట్ ఓ కొత్త రకమైన కాక్ టెయిల్‌ను తన మెనూలో చేర్చింది.ఈ కాన్‌టెయిల్ ధర ఏకంగా రూ. 10 లక్షలు కావడం విశేషం. ఇంతకీ ఈ కాక్ టెయిల్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటి.? అంత ధర ఎందకనేగా మీ డౌట్. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఈ కాక్ టెయిల్ పేరు మ్యారో మార్టిని. అమెరికాలోని షికాగోలో ఉన్న అడాలినా అనే ఓ రెస్టరంట్ తాజాగా సరికొత్త కాక్‌టెయిల్‌ను పరిచయం చేసింది. దాని పేరే మ్యారో మార్టిని. దీనిలో క్లాస్ ఆక్సుల్ మెజ్కల్, హెర్లూమ్ టొమాటో వాటర్, లెమన్ బాసిల్ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. ఈ కాక్ టెయిల్ ధర 13వేల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 10 లక్షలన్నమాట. అయితే ఈ కాక్‌టెయిల్ తయారీ సాధారణంగా ఉన్నా దాన్ని సర్వీంగ్ విభిన్నంగా ఉంటుంది.
ఈ పానియాన్ని 150 వజ్రాలు పొదిగిన 14 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన జ్యువెలరీతో దీన్ని అలంకరిస్తారు. అందుకే ఈ కాక్ టెయిల్‌కు ఇంత ఖర్చన్నమాట. ‘మరోఫైన్’ అనే బంగారు ఆభరణాల తయారీ సంస్థ ఈ వజ్రాలు పొదిగిన నెక్లెస్‌ను రూపొందిస్తోంది. ఇలా తయారు చేసిన పానీయం గ్లాస్‌ను ఎంతో ఆకర్షణీయంగా అలంకరించి అందిస్తారు. ప్రస్తుతం ఈ కాక్ టెయిల్‌కు సంబంధించి వార్తలు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..