AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రమాదంపై ఎయిర్‌ ఇండియా అధికారిక ప్రకటన.. ఫ్లైట్‌లో ఉన్న భాయతీయులు ఎంతమందంటే?

గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.38PMకి ఎయిర్‌ ఇండియా AI171 విమానం లండన్‌ వెళ్లేందుకు బయల్దేరింది. అయితే ఈ విమానం రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే ఎయిర్‌ సమీపంలోని ఓ బిడ్జింగ్‌ను ఢీకొని కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఎయిర్‌ పోర్ట్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాద ఘటనపై తాజాగా ఎయిర్ ఇండియా అధికారికంగా ఎక్స్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారాన్ని తెలియజేసింది.

విమాన ప్రమాదంపై ఎయిర్‌ ఇండియా అధికారిక ప్రకటన.. ఫ్లైట్‌లో ఉన్న భాయతీయులు ఎంతమందంటే?
Air India
Anand T
|

Updated on: Jun 12, 2025 | 4:31 PM

Share

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్లేందుకు బయల్దేరిన బోయింగ్ 787-8 విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నట్టు ఎయిర్‌ ఇండియా ఛైర్మన్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో స్పష్టం చేశారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్, 7 పోర్చుగీస్ దేశానికి చెందిన పౌరులు ఉన్నట్టు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఈ వినాశకరమైన సంఘటనలో ప్రభావితమైన వారందరి కుటుంబాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఈ సమయంలో ప్రాథమిక దృష్టి బాధిత వారందరినీ, వారి కుటుంబాలను ఆదుకోవడం. అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయం చేయడానికి, బాధిత వారికి అవసరమైన అన్ని సహాయం, సంరక్షణను అందించడానికి, శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామని ఎయింర్ ఇండియా తెలిపింది. అత్యవసర కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి, సమాచారం కోరుకునే కుటుంబాల కోసం సహాయక బృందాలను ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా పోస్ట్‌లో పేర్కొంది.

ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను- 1800 5691 444 ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారం X హ్యాండిల్ ([https://x.com/airindia](https://x.com/airindia)), వెబ్‌సైట్ [http://airindia.com](http://airindia.com) ద్వారా పొందవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. మీడియా వ్యక్తులు ప్రయాణికుల హాట్‌లైన్‌కు కాల్ చేయవద్దని… ప్రశ్నల కోసం ప్రత్యేక మీడియా నంబర్ +91 9821414954 ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

అయితే, ఈ విమానం ఎయిర్‌ పోర్ట్ సమీపంలోని బిల్డింగ్‌ను ఢీకొట్టడంతో కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. అయితే విమానం బిడ్జింగ్‌ను ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. అయితే ఈ విమానం ఢీకొట్టిన భవనంలో కూడా సుమారు 20 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..