Watch: 16 సెకన్లలో 17 చెంపదెబ్బలు.. నగల దుకాణంలో మహిళపై దాడి.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కొన్నిసార్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు కూడా ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేస్తుంటారు. ఇలాంటివి కొన్ని భయానక యాక్సిడెంట్లు, చోరీలు, ఫన్నీ ఇన్సిడెంట్లు, రోడ్లు, భవనాలు, మార్కెట్‌ సముదాయాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌లు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఒక నగల దుకాణంలోకి వెళ్లిన ఒక మహిళను యడాపెడా 17 సార్లు చెప్పలు వాయించాడు ఆ దుకాణం యజమాని. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో అసలు వివరాల్లోకి వెళితే...

Watch: 16 సెకన్లలో 17 చెంపదెబ్బలు.. నగల దుకాణంలో మహిళపై దాడి.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Ahmedabad Robbery

Updated on: Nov 09, 2025 | 8:13 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి చెందినదిగా తెలిసింది. ఒక వ్యాపారవేత్త బంగారు దుకాణంలో ఒక మహిళను కొడుతున్న సంఘటన ఇది. ఈ 16 సెకన్ల క్లిప్‌లో వ్యాపారవేత్త ఆ మహిళను ఏకంగా 17 సార్లు కొట్టాడు. ఈ షాకింగ్ సంఘటన అహ్మదాబాద్‌లోని రనిప్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. బంగారు దుకాణంలో ఒంటరిగా కూర్చున్నాడు యజమాని. అంతలోనే ఒక మహిళ దుకాణానికి వచ్చింది. అతన్ని మాటల్లో పెట్టిన సదరు లేడి అతడి కళ్లల్లో కారం పొడి చల్లేందుకు ప్రయత్నించింది. వెంటనే అలర్ట్‌ అయిన ఆ దుకాణ దారుడు మహిళను పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించాడు. కేవలం 16 సెకన్లలో 17 సార్లు కొట్టాడు. దుకాణంలో జరిగిన ఈ మొత్తం సంఘటన సిసిటివి కెమెరాలో రికార్డైంది. వ్యాపారవేత్త ఫిర్యాదు చేయడానికి నిరాకరించినప్పటికీ, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అహ్మదాబాద్‌లోని రనిప్ ప్రాంతంలోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. నగల దుకాణంలో యజమాని ఒక్కడే ఉండటం గమనించిన కిలేడీ అతని కళ్లల్లో కారం పొడి చల్లి దోపిడీ చేసేందుకు యత్నించింది. కానీ, ఆ దుకాణదారుడు అప్రమత్తంగా వ్యవహరించటంతో అతడు చోరీ నుంచి తప్పించుకోగలిగాడు. దాడిని తప్పించుకోవడమే కాకుండా నిందితురాలిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

ఈ కొన్ని సెకన్ల వీడియోలో స్వర్ణకారుడు ఆ మహిళను 17 కంటే ఎక్కువసార్లు చెంపదెబ్బ కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్లిప్‌ను himmatwale73 అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే వైరల్ అయింది. ఇప్పటివరకు దాదాపు 150,000 మంది దీనిని చూశారు. వీడియో చూసిన తర్వాత చాలా మంది మిశ్రమ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది దుకాణదారుడిని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..