Mothers Love: అమ్మ ఎప్పటికీ అమ్మే.. తన కూతురు వర్షంలో తడవకుండా తల్లి పడే తపన.. హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్..

ఆ తల్లి కాళ్లకు చెప్పులు కూడా లేవు.. అయినప్పటికీ తన కష్టాన్ని పట్టించుకోకుండా తన కూతురు సేఫ్ గా ఉండడం కోసం తపన పడుతోంది తల్లి. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Mothers Love: అమ్మ ఎప్పటికీ అమ్మే.. తన కూతురు వర్షంలో తడవకుండా తల్లి పడే తపన.. హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్..
Mothers Love
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2022 | 5:17 PM

సృష్టిలో అమూల్యమైనది అమ్మ ప్రేమ. ప్రపంచంలో వెలకట్టలేనిది, నిస్వార్ధమైనది ఏదైనా ఉంది అంటే.. నిస్సందేహంగా అది తల్లి ప్రేమే. అందుకే తల్లినిమించిన దైవం లేదు అంటారు. తల్లి తన బిడ్డలకోసం నిరంతరం పరితపిస్తుంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగిని తల్లడిల్లిపోతుంది. కొవ్వొత్తిలా తాను కరుగుతూ తన పిల్లల జీవితంలో వెలుగులు నింపేది అమ్మ. అటువంటి అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా.. ఎన్ని సార్లు చెప్పినా తక్కువే.. తాజాగా అటువంటి అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో..  ఓ తల్లి తన బిడ్డను స్కూలునుంచి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వైరల్‌ అవుతున్న ఈవీడియోలో చూస్తుంటే ఆ ప్రాంతంలో వర్షం పడుతోంది. ఓ తల్లి తన బిడ్డను స్కూలునుంచి ఇంటికి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ బిడ్డ ఎక్కడ వర్షంలో తడిచిపోతుందోనని ఆ చిన్నారిని తన బుజాలపై ఎక్కించుకొని, ఓ చేత్తో గొడుగు వేస్తూ మరో చేత్తో చిన్నారిని జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తోంది. అంతేకాదు ఆ తల్లి కాళ్లకు చెప్పులు కూడా లేవు.. అయినప్పటికీ తన కష్టాన్ని పట్టించుకోకుండా తన కూతురు సేఫ్ గా ఉండడం కోసం తపన పడుతోంది తల్లి. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. తల్లి ఎప్పటికీ త‌ల్లేనంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించగా వందల్లో లైక్‌ చేశారు. ఈ వీడియోపై చాలామంది నెటిజ‌న్లు స్పందించారు. వీడియో హృద‌యాన్ని తాకేలా ఉంద‌ని, ప్రేమ‌కు విస్పష్ట సంకేత‌మ‌ని రకరకాలుగా కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ట్విట్టర్‌లో 59,000 కంటే మంచి చూశారు. అంతేకాదు ఈ తల్లీకూతుళ్ల బంధం నెటిజన్లను ఆకట్టుకుంది. “ప్రేమ..  వ్యక్తిత్వం”  కొందరిని ఆకట్టుకుంటే.. మరికొందరు ఇది “హృదయానికి హత్తుకుటుంది అని వ్యాఖ్యానించారు. “తల్లి ప్రేమ షరతులు లేనిది” అని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?