ఇదేం త్రోయింగ్ బాబూ ? పిల్లాడినీ.. కుక్కనీ ఒకే గాటన కట్టావా ?
యుఎస్ లోని టెనెసీ లో అదో మధ్యతరగతి ఇల్లు.. అయితే ఏం ? ఆ ఇంటి యజమానికి సరదాగా తన ఏడేళ్ల కొడుకు తోను, పెంపుడు కుక్క తోనూ ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు వెరైటీ ‘ గేమ్స్ ‘ ఆడుతుంటాడు. ఈ మధ్య ఇలాగే అతనికో వింత ఆలోచన వచ్చింది. రావడమే తడవు.. అమల్లో పెట్టేశాడు. తన కొడుకును భుజాల పైకి ఎత్తుకుని కాస్త దూరంలో ఉన్న బెడ్ పై విసరడమే ఈ ‘ […]
యుఎస్ లోని టెనెసీ లో అదో మధ్యతరగతి ఇల్లు.. అయితే ఏం ? ఆ ఇంటి యజమానికి సరదాగా తన ఏడేళ్ల కొడుకు తోను, పెంపుడు కుక్క తోనూ ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు వెరైటీ ‘ గేమ్స్ ‘ ఆడుతుంటాడు. ఈ మధ్య ఇలాగే అతనికో వింత ఆలోచన వచ్చింది. రావడమే తడవు.. అమల్లో పెట్టేశాడు. తన కొడుకును భుజాల పైకి ఎత్తుకుని కాస్త దూరంలో ఉన్న బెడ్ పై విసరడమే ఈ ‘ తలాతోకా ‘ లేని గేమ్ ‘ థీమ్ ‘. ఆ కుర్రాడు కూడా దీన్ని భలే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ తండ్రీ కొడుకుల ఆటకు వాళ్ళ పెంపుడు కుక్క కూడా తోడయింది. ఆ ఇంటి ‘హీరో గారు ‘ అలా కొడుకును విసరగానే అది కూడా చటుక్కున అతనిమీదికి చెంగుమంటూ ఎగిరి చేతుల్లో వాలడం.. దాన్నికూడా ఆయన బెడ్ పైకి విసరడం.. .అదీ ఎంజాయ్ చేయడం.. . అంతా భలే వెరైటీ త్రోయింగ్ ! ఆ గృహస్థు గారి భార్యామణి ఈ వైనాన్ని వీడియో తీసి వదిలింది. మనం కూడా చూడాల్సిందే. !