Laundry Hacks: బట్టలు తెల్లగా మెరవాలా..? పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేస్తే సరి..! రిజల్ట్ చూసి షాక్ అవుతారు
సోషల్ మీడియాలో హక్స్, ట్రిక్స్ వైరల్ అవుతూ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్నిసార్లు కొందరు పాత్రలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. కొందరు ఇల్లు శుభ్రం చేయడానికి నిమ్మకాయను వాడుతుంటారు. కానీ ఈసారి, ఒక వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఇది జనాల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే..ఈ వీడియోలో ఒక మహిళ పారాసెటమాల్ మాత్రలను డిటర్జెంట్‌గా ఉపయోగిస్తుంది.

ప్రతిరోజూ సోషల్ మీడియాలో హక్స్, ట్రిక్స్ వైరల్ అవుతూ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్నిసార్లు కొందరు పాత్రలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. కొందరు ఇల్లు శుభ్రం చేయడానికి నిమ్మకాయను వాడుతుంటారు. కానీ ఈసారి, ఒక వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఇది జనాల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే..ఈ వీడియోలో ఒక మహిళ పారాసెటమాల్ మాత్రలను డిటర్జెంట్‌గా ఉపయోగిస్తుంది. అవును పారాసెట్మల్ మాత్రలతో బట్టలు ఉతుకుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ట్రిక్ వాస్తవానికి బట్టలు మెరిసేలా చేస్తుంది. వీడియో చూసే వ్యక్తులు దీనిని మ్యాజిక్ అని పిలుస్తున్నారు. మరికొందరు దీనిని వైద్య మందుల దుర్వినియోగం అని కూడా అంటున్నారు.
వైరల్ వీడియోలో ముందుగా ఒక మహిళ తన వాషింగ్ మెషిన్ దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె తన లాండ్రీలో పారాసెటమాల్ మాత్రలను వేసి మెషీన్ ఆన్ చేస్తుంది. కొంత సమయం తర్వాత బట్టలు బయటకు తీసినప్పుడు, అవి మెరిసిపోతూ, ఎలాంటి మరకలు లేకుండా కనిపిస్తాయి. ఆ మహిళ కాలర్ పసుపు రంగులోకి మారిన తెల్లటి చొక్కాను బయటకు తీసినప్పుడు వీడియోలో అత్యంత షాకింగ్ భాగం వస్తుంది. ఆమె దానిని నీటితో నిండిన టబ్‌లో వేసి కొన్ని పారాసెటమాల్ మాత్రలను వేస్తుంది. కొంతటైమ్ తర్వాత చొక్కాను బయటకు తీసినప్పుడు దాని కాలర్ పూర్తిగా తెల్లగా, కొత్తదిగా ఉంటుంది.
వీడియో ఇక్కడ చూడండి..
सफ़ेद कपडे से मैल हटाने का सबसे आसान तरीका… pic.twitter.com/vQn2Ijhq4T
— 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮 (@acharyaveda_) October 5, 2025
@acharyaveda_ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీనిని లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంకెవరైనా దీనిని ప్రయత్నించి ఉంటే నాకు తెలియజేయండి. అప్పుడు నేను కూడా ప్రయత్నిస్తాను అంటూ ఒకరు రాశారు. నేను కూడా దీనిని ఉపయోగించాను.. ఈ ఆలోచన బాగా పనిచేస్తుందని ఇంకొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




