Trending Video: తైవాన్ లోనూ తగ్గేదేలే.. కాలా ఛష్మా పాటకు తగ్గని క్రేజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డ్యాన్స్ వీడియో..
సోషల్ మీడియా ఉంటే చాలు.. క్షణాల్లో వైరల్ గా మారడానికి. కొద్ది సమయంలోనే ఎక్కువ రీచ్ పొందడానికి. అలా వైరల్ అయిన వీడియోలు, ఫొటోలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. బార్ బార్ దేఖో సినిమా విడుదలై ఆరేళ్లు..
సోషల్ మీడియా ఉంటే చాలు.. క్షణాల్లో వైరల్ గా మారడానికి. కొద్ది సమయంలోనే ఎక్కువ రీచ్ పొందడానికి. అలా వైరల్ అయిన వీడియోలు, ఫొటోలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. బార్ బార్ దేఖో సినిమా విడుదలై ఆరేళ్లు గడిచినా అందులోని కాలా ఛష్మా పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో మరోసారి మారు వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ వీడియో గతేడాది అక్టోబర్ లో తీసినది, అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తైవాన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కొంతమంది డ్యాన్సర్లు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మ్యారేజ్ హాల్ లో యువకుల బృందం డ్యాన్స్ కాలా ఛష్మా పాటకు డాన్స్ చేస్తోంది. మధ్యలో ఓ యువతి ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్‌కి మంచి ఊపు తీసుకొచ్చింది. చుట్టూ కూర్చున్న అతిథులు చప్పట్లతో హోరెత్తించారు.
మరోవైపు ఆ డాన్స్ పెర్‌ఫార్మెన్స్‌ను తమ మొబైల్స్‌లో బంధించి నెట్టింట షేర్ చేశారు. దాంతో ఓ రేంజ్‌లో ఈ వీడియో వైరల్ అయింది. కాగా ఈ వీడియోను ఉల్ జాంగ్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తాజాగా మరోసారి రీ పోస్టు చేశారు. ఇప్పుడు కూడా ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. తాజాగా ఈ వీడియోను 20 లక్షలమందికి పైగా వీక్షించగా.. 4 లక్షల 38 వేలమంది లైక్ చేశారు. ఇక కామెంట్ల విషయానికి వస్తే.. అద్భుతంగా చేశారని చాలామంది యూజర్లు మెచ్చుకున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..