సూదిలో దారం ఎక్కించలేకపోతున్నారా.. ఈ ట్రిక్ పాటిస్తే సెకన్లలోనే పని పూర్తవుతుంది..
సూదిలో దారం ఎక్కించడం చాలా కష్టం. దానికి చాలా ఓపిక, సమయం చాలా అవసరం. కొందరు దారం ఎక్కించేందుకు తీవ్రంగా కష్టపడితే మరికొందరు మాత్రం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తుంటారు. మన చిన్నతనంలో..
సూదిలో దారం ఎక్కించడం చాలా కష్టం. దానికి చాలా ఓపిక, సమయం చాలా అవసరం. కొందరు దారం ఎక్కించేందుకు తీవ్రంగా కష్టపడితే మరికొందరు మాత్రం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తుంటారు. మన చిన్నతనంలో అమ్మమ్మ లేదా నాన్నమ్మలు బట్టలు కుట్టడానికి సూదిని ఉపయోగించే వారని మనకు తెలిసిందే. ఇప్పుడంటే కుట్టు మిషన్లు అందుబాటులోకి వచ్చాయి గానీ.. పూర్వ కాలంలో బట్టలు కుట్టేందుకు సూది, దారాన్నే ఉపయోగిస్తుండేవారు. వారు ఎంతో ఓపికగా సూదిలో దారం ఎక్కించి మరీ బట్టలు కుడుతుంటారు. ఈ పనిని ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పనిగా చెప్పుకోవచ్చు. అయినా ఇప్పటికీ చాలా మంది సూదిలో దారం ఎక్కించడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అలాంటి వారు కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. సోషల్ మీడియాలో వినోదానికి సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వీడియోలలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతే కాకుండా ఇది మన పనిని సులభతరం చేస్తుంది. వీటిని లైఫ్ హ్యాక్స్ అని పిలుస్తారు. సులువైన పద్ధతిలో సమస్యను పరిష్కరించవచ్చు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో లో ఓ వ్యక్తి..మొదట టూత్ బ్రష్‌పై దారాన్ని ఉంచాడు. తర్వాత అతను సూది రంధ్రం భాగాన్ని పైకి క్రిందికి నెడతాడు. ఇలా చేయడం ద్వారా దారం సూదిలోకి చాలా సులభంగా వెళ్లేలా చేస్తుంది. వీడియో కేవలం 10 సెకన్లు మాత్రమే అయినప్పటికీ పనిని ఇప్పుడు మీరు సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. ఈ పని చేయడం చాలా చిన్నగా అనిపించినప్పటికీ.. మంచి ప్రయోజనాన్నిస్తుంది. వృద్ధాప్యంతో ఉన్న వాళ్లు, కళ్లు సరిగ్గా కనిపించని వారికి ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.
View this post on Instagram
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వార్తలు రాసే వరకు 90 వేల మందికి పైగా చూశారు. అంతే కాకుండా ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి