Viral Video: పంటలు పండిచడమే కాదు.. కొత్త ఆవిష్కరణలు చేయడమూ తెలుసు.. రైతు ట్యాలెంట్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు
భారతదేశంలో నైపుణ్యాలకు కొదవ లేదు. ప్రతి ఒక్కరిలోనూ ట్యాలెంట్ దాగి ఉంది. అది అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. అయితే.. దేశంలో చాలా మంది ప్రజలు వ్యవసాయాన్ని ఆసరాగా చేసుకుని...
భారతదేశంలో నైపుణ్యాలకు కొదవ లేదు. ప్రతి ఒక్కరిలోనూ ట్యాలెంట్ దాగి ఉంది. అది అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. అయితే.. దేశంలో చాలా మంది ప్రజలు వ్యవసాయాన్ని ఆసరాగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంది. అంతే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోంది. ప్రస్తుతం అత్యంత తక్కువ సమయంలో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు ఉన్నాయి. తమలోని ట్యాలెంట్ ను బయటకు తీసేందుకు ఇది చక్కటి ప్లాట్ ఫామ్ లా ఉపయోగపడుతుంది. సాధారణంగా వ్యవసాయలో వివిధ పనులు చేసేందుకుు విద్యుత్, యంత్రాలను ఉపయోగిస్తాం. పంటకు నీరు అందించేందుకు సమీపంలోని నీటి వనరుల వద్ద మోటార్ ఫిక్స్ చేస్తాం. అక్కడి నుంచి నీటిని పంప్ ద్వారా పొలానికి అందిస్తుంటారు. అయితే విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లోనూ వ్యవసాయం చేస్తుంటారు. పంటలకు నీటిని అందించేందుకు రైతులే స్వయంగా కొన్ని ఆవిష్కరణలు చేస్తారు. ఏతం.. అనేది ఇలా తయారైందే. దీని ద్వారా కరెంట్ ను ఉపయోగించకుండా నీటిని తోడుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఓ రైతు వ్యవసాయ పరికరాన్ని తయారు చేశాడు. దానిపైకి ఓ ఆవు
ఎక్కి నడుస్తోంది. అది నడుస్తున్న సమయంలో యంత్రం కింద ఉన్న వీల్ తిరిగుతూ.. నీటిని తోడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు తెలివికి శెభాష్ అంటున్నారు. అంతే కాకుండా వీడియోను మళ్లీ మళ్లీ చూస్తూ.. తెలిసిన వారికి, స్నేహితులకు, బంధువులకు షేర్ చేస్తున్నారు.
RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5
— Awanish Sharan (@AwanishSharan) September 23, 2022
ఈ వీడియోను IAS అధికారి @AwanishSharan తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియోను చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..