Viral Video: సముద్రంలో చేపల వేట.. వలకు చిక్కింది చూసి కళ్లు జిగేల్.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్!

|

Jul 25, 2022 | 12:30 PM

సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. వల నిండా బోలెడన్ని చేపలు తీసుకొస్తేనే ఆ వారం మత్స్యకారుల...

Viral Video: సముద్రంలో చేపల వేట.. వలకు చిక్కింది చూసి కళ్లు జిగేల్.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్!
Telia Bhola Fish
Follow us on

సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. వల నిండా బోలెడన్ని చేపలు తీసుకొస్తేనే ఆ వారం మత్స్యకారుల బ్రతుకు జట్కా బండి ముందుకు సాగుతుంది. ఇక సంద్రంలో వేటకు వెళ్లినవారికి చేపలు దొరక్కపోతే.. వాళ్లు మళ్లీ ఒడ్డుకు చేరేందుకు కొన్ని వారాలు పడుతుంది. తాజాగా ఓ జాలరి వలకు భారీ చేప చిక్కడంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఆ కథేంటంటే..

ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన ఓ జాలరి తనకున్న సాంప్రదాయ వలలతో.. సాంప్రదాయ తెప్ప బోటులో సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. అతడి కళ్లు జిగేల్ అనేలా 32 కేజీల బరువున్న తెలియా జాతికి చెందిన భారీ చేప వలకు చిక్కింది. అతడు దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి చాందినిపల్ చేపల మార్కెట్లో వేలం వేయగా.. కోల్‌కతాకు చెందిన ఓ ఫార్మసీ కంపెనీ రూ. 3.10 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, తెలియా చేపలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయని.. వాటి చర్మం, లోపల భాగాలు మందుల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. అందుకే వేలంలో ఈ చేప అంత ధర పలికిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.