AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చనిపోయిన మగపాము పక్కనే ఒక రోజంతా ఉన్న ఆడపాము – ఆ తర్వాత

మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో అసాధారణ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై వాహన ప్రమాదంలో మగ పాము చనిపోయింది. కొద్దిసేపటికే ఆడ పాము అక్కడికి చేరుకుని మృత సర్పం పక్కన 24 గంటల పాటు నిలిచి.. దుఃఖాన్ని వ్యక్తం చేసిందట. గ్రామస్తులు ఈ సంఘటనను ఆశ్చర్యంగా గమనించగా.. చివరికి ఆడ పాము కూడా ప్రాణాలు వదిలిందని చెబుతున్నారు.

Viral: చనిపోయిన మగపాము పక్కనే ఒక రోజంతా ఉన్న ఆడపాము - ఆ తర్వాత
Snake
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2025 | 3:10 PM

Share

మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలోని ధుర్కుడా కాలనీలో జరిగిన ఘటన స్థానికుల్ని కన్నీరు పెట్టించిందట. ప్రాణప్రియుడిని కోల్పోయిన ఆడ సర్పం తన భాగస్వామి పక్కనే 24 గంటల పాటు నిలిచి ఉందని స్థానికులు చెబుతున్నారు. భాగస్వామిని విడిచి బతకలేక ఆ పాము కూడా ప్రాణాలు వదిలిందట. ఈ ఘటన గురువారం పహడ్గఢ్ పంచాయతీ సమితి పరిధిలో వెలుగుచూసిందని ఓ డిజిటల్ మీడియా పబ్లికేషన్ వెల్లడించింది. రహదారిపై వాహనం తొక్కడంతో మగ సర్పం మరణించింది. గ్రామస్తులు ఆ మగ పామును రోడ్డుకు పక్కన ఉంచగా.. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న ఆడ సర్పం అక్కడ ఉండి తన బాధను వ్యక్తపరిచింది. ఏ కదలిక లేకుండా మగ పామును చూసుకుంటూ తీరని దుఃఖంలో మునిగిపోయిందట.

ఆ ఆడ సర్పం తమకు ఏదో చెప్పాలన్నట్లు ప్రయత్నించిందని గ్రామస్థులు తెలిపారు. దాదాపు 24 గంటల పాటు తన ప్రాణసఖుడి పక్కనే ఉండి.. చివరకు తాను కూడా ఈ లోకాన్ని వీడింది. ఈ హృదయ విదారక ఘటన చూసిన గ్రామస్థులందరూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. మరో జన్మలో అయినా వాటి జీవనం ఎల్లకాలం ఉండాలని కాంక్షిస్తూ.. సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు.

సనాతన ధర్మంలో నాగుల్ని ప్రత్యేకంగా పూజిస్తారన్న విషయం తెలిపిందే. అందుకే ఆ పాముల అనురాగానికి గుర్తుగా.. గ్రామస్థులు ఆ ప్రదేశంలో ఓ వేదిక నిర్మించాలని నిర్ణయించారు. అది వారి ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటన పాములలోని బంధాలకు గొప్ప సాక్ష్యంగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..